ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారంతో ముగిశాయి.
మే చివరి వారంలో ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ప్రధాన పరీక్షలు గురువారమే పూర్తయినా సంస్కృతం, వృత్తి విద్యా పరీక్షలు శనివారం వరకు జరిగాయి. పరీక్షల ఆరంభంలోనే అక్రమాలకు ముకుతాడు వేసేలా ఎంఈవో, చీఫ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఎక్కడా అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు వివరించారు.
ఈ నెల 15 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం జరగుతుందన్నారు. 13 జిల్లాల్లోని పేపర్లను ఒక్కో దాన్ని వేర్వేరు జిల్లాల్లోని మూల్యాంకన కేంద్రాలకు పంపి ఈ నెల 28 నాటికి మూల్యాంకనం పూర్తి చేస్తామన్నారు. మే చివరి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్టు పరీక్షల విభాగం డైరక్టర్ వివరించారు.