హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్కడి నుంచి రావలసిన వివరాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయానికి అందలేదు. దీంతో ఈ నెల 10 నుంచి జరగాల్సిన హాల్‌టిక్కెట్ల జారీ నిలిచిపోయింది. సుమారు 1.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.
వాయిదా పడే అవకాశాలు: సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏపీసెట్ వాయిదా పడే అవకాశాలున్నాయి. పరీక్ష కోసం ఆ ప్రాంతంలో 8 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు సుమారు 160 కేంద్రాలు అవసరం ఉన్నట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతంలో విద్యాసంస్థల బంద్ కారణంగా పరీక్ష కేంద్రాల వివరాలు అందలేదని, దీంతో పరీక్షల ప్రక్రియను ప్రారంభించలేక పోతున్నామన్నారు. సెట్ నిర్వహణపై 2రోజులో ప్రభుత్వానికి నివేదికను అందచేస్తామన్నారు.
వాయిదా దిశగా ఏపీసెట్!
Published Thu, Sep 5 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement
Advertisement