samaikyandhra bandh
-
ఆగని విభజన మంటలు
-
మా శ్వాస...ఆశ సమైక్యమే
-
కొనసాగుతున్న బంద్...నిలిచిన్ బస్సులు
-
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
విభజన ఆపాలంటూ విద్యార్ధుల ఆందోళన
-
నేడు కూడా తూ.గో.జిల్లాలో సమైక్య బంద్
-
కర్నూలులో రోడ్డెక్కిన సమైక్యవాదులు
-
చిత్తూరు జిల్లావ్యాప్తంగా బంద్
-
అడుగడుగునా నిరసన
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: కేంద్ర కేబినెట్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లా భగ్గుమంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్లు ఆందోళనలు ముమ్మరం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చి రాస్తారోకోలు, బంద్‌లు, నిరసనలు చేస్తుంటే మరోవైపు మిగిలిన వర్గాల ప్రజలూ నిరసన బాట పట్టారు. హైవే దిగ్బంధం: రాష్ట్ర విభజన నిర్ణయానికి ఆగ్రహించిన విద్యార్థి జేఏసీ నాయకులు ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌పై బైఠాయించారు. స్థానిక రావ్‌అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద హైవేపై నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. విద్యార్థి జేఏసీతో పాటు ఒంగోలు న్యాయవాదుల జేఏసీ నాయకులు, యువజన జేఏసీ నాయకులు కూడా హైవే దిగ్బంధంలో పాల్గొన్నారు. దక్షిణ బైపాస్ కూడలిలో సమైక్యాంధ్ర ఫ్రంట్ అధ్యక్షుడు నాగరాజు, కన్వీనర్ రాజశేఖర్ తమ అనుయాయులతో బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై దాదాపు గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసన్ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు రాస్తారోకో.. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాద జేఏసీ, విద్యార్థి, యువజన జేఏసీల ఆధ్వర్యంలో అర్ధగంట పాటు రాస్తారోకో చేశారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ జాషువా ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆ తరువాత విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్ నాయకులు నగరంలో బ్యాంకులు, కార్యాలయాలు, దుకాణాలు మూయించారు. కలెక్టరేట్లోని సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూసేయడంతో పాలన స్తంభించింది. కందుకూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. జేఏసీ నాయకులు ముప్పూరి చంద్ర, పోరూరి చంద్రకాంత్, బెజవాడ కృష్ణయ్య, పాలేటి కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో పూర్తిస్థాయి బంద్ పాటించారు. చీరాలలో ఉద్యోగ జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలో దుకాణాలు మూయించారు. జేఏసీ నాయకుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నాయకులు బంద్ విజయవంతం చేశారు. దర్శిలో న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. నిరసన ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని నినదించారు. కొండపిలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను మూయించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు నిరసనలో పాల్గొని ప్రధాన సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపైనే ఆటలాడి నిరసన వ్యక్తం చేశారు. పర్చూరు, గిద్దలూరు, సంతనూతలపాడు, అద్దంకి, యర్రగొండపాలెం, కనిగిరిల్లో ఎన్జీఓలు, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించారు. కనిగిరిలో న్యాయవాదులు కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. మంత్రి, ఎంపీ రాజీనామాలు చేయకుంటే తిరగనివ్వం: జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు తక్షణమే రాజీనామాలు చేయాలని, లేకుంటే జిల్లాలో తిరగనిచ్చేది లేదని విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో.కన్వీనర్ రాయపాటి జగదీష్ తెగేసి చెప్పారు. సీమాంధ్రకు ఇంత అన్యాయం జరుగుతున్నా నేతలు పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు దద్దమ్మలుగా మారిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతోనే ఆగిపోవాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
వెలుగుల పండుగ..వెలవెల
సాక్షి, ఒంగోలు : దీపావళి.. వెలుగు నింపే పండుగ. ఇంటి ముంగిట దీపాల వరుసలు, కొత్త దుస్తులు, పిండివంటలతో ఇంటిల్లిపాదీ సంతోషంతో వెలిగిపోతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం పండుగ కళ తప్పింది. వెలుగుల పండుగ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. సమైక్యాంధ్ర బంద్, వర్షాల ప్రభావం.. సమైక్యాంధ్ర బంద్ కారణంగా ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు..ఇలా ఒకరేమిటి? అన్ని వర్గాల వారిపై మోయలేని, కోలుకోలేని ప్రభావం పడింది. సుమారు మూడు నెలలపాటు జీతాల్లేక ఉద్యోగులు, వ్యాపారాలు సజావుగా జరగక వ్యాపారులు, చదువులు కుంటుపడి విద్యార్థులు... ఇలా అన్ని రకాలుగా ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పెట్రోలు, డీజిల్ ధరలు తరచుగా పెరుగుతూ వాటి ప్రభావం నిత్యావసర వస్తువులు, రవాణా రంగంపై పడడంతో ఏ వస్తువూ కొనలేని, తినలేని పరిస్థితి దాపురించింది. కూరగాయలు, ఆకు కూరల ధరలు కూడా భగ్గుమంటూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల విద్యుత్ కోతలతో పరిశ్రమలు అనేకం మూతపడ్డాయి. భారీ పరిశ్రమలపై కూడా ఈ భారం పడడంతో ఉత్పత్తి సక్రమంగా లేక, కార్మికులకు పనులు లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇన్ని బాధలు ఎలాగోలా పడుతున్నా... తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. సాగుచేసిన పత్తి, వరి, వేరుశనగ, కంది తదితర పంటలతోపాటు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతన్న కుప్పకూలిపోయాడు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో రైతుల మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు. మరోవైపు పేదలు నివసించే అనేక కాలనీలు ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమయ్యాయి. ఇళ్లలో ఉండే ధాన్యం, ఇతర వస్తువులన్నీ నీటిపాలు కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో భారీగా సాగులో ఉన్న రొయ్యల గుంటలను వరద నీరు ముంచెత్తడంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రొయ్యల రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల వారికి పండుగ జరుపుకోవడం భారమే. పేలుతున్న టపాసుల ధరలు పలు రకాల కారణాలతో ఆర్థికంగా సతమతమవుతున్న ప్రజలను ఈ ఏడాది భారీగా పెరిగిన టపాకాయల ధరలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ధరలు ఎంతైనా తప్పనిసరిగా కాస్తోకూస్తో కొనాల్సి ఉన్నా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. శుక్రవారం ఉదయం జిల్లాలో కొద్దిపాటి వర్షం పడడంతో దీపావళి పండుగ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆలోచన వ్యాపారులు, ప్రజల్లో ఉంది. భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన టపాకాయలు అమ్ముడవుతాయో లేదోనని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పోసొప్పో చేసి బాణసంచా కొన్నప్పటికీ, పండగ రోజు వర్షం కురిస్తే సంతోషం ఉండదు కదా అని ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. బోసిపోతున్న బంగారం దుకాణాలు ఏటా దీపావళి సీజన్ వచ్చే సరికి కళకళలాడే బంగారం దుకాణాలు ఈసారి వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది సమైక్యాంధ్ర సమ్మె, వర్షాలతోపాటు పసిడి దిగుమతులు భారీగా తగ్గడం, ధరలు ఆకాశాన్ని అంటడం తదితర కారణాలతో బంగారం వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 20 శాతం కూడా వ్యాపారం జరగలేదని దుకాణదారులు చెబుతున్నారు. బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావం ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మూడు నెలలుగా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని, సొంత దుకాణాలు, పెట్టుబడులు పెట్టే వారు ఎలాగోలా నిలదొక్కుకుంటున్నారు కానీ అద్దె దుకాణాలు నిర్వహించే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాపారులు వాపోతున్నారు. వంద గ్రాముల బంగారం బిస్కెట్ ధర ప్రస్తుతం రూ 3.11 లక్షల వరకు పలుకుతోంది. అయితే ధరలు రోజుకో విధంగా మారుతుండడం కూడా కొనుగోలుదారులను ఆ వైపు చూడనీయకుండా చేస్తోంది. -
శ్రీకాకుళంలో మూడోరోజు కొనసాగుతున్న బంద్
-
శ్రీకాకుళంలో రెండవరోజు కొనసాగుతున్న బంద్
-
విజయవాడలో బంద్ వాతావరణం
-
ఆకలి కేకలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మె పేదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా కాకపోవడంతో బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు ఇళ్లకు చేరాల్సి ఉన్నా వాటి జాడే లేకపోవడంతో పేదల కడుపులు కాలిపోతున్నాయి. ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో స్పష్టంగా తెలియకపోవడంతో బయట మార్కెట్లో వందల రూపాయలు వెచ్చించి బియ్యం, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పస్తులతో బతుకు బండి లాగిస్తున్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి దిగారు. వారితో పాటు హమాలీలు కూడా సమ్మె బాట పట్టారు. దీంతో సెప్టెంబర్‌కు సంబంధించి చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గోదాముల్లో నిత్యావసరాలు నిండుగా ఉన్నా వాటిని తరలించే హమాలీలు కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 8 లక్షల 55 వేల 439 కుటుంబాలు చౌకధరల దుకాణాల నుంచి బియ్యంతో పాటు నిత్యావసరాలకు దూరమయ్యారు. జిల్లాలో 2100 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 55 వేల 439 తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా కిలో రూపాయి బియ్యం 12 వేల టన్నులు సరఫరా చేస్తారు. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ గోడౌన్లో 9 వేల టన్నుల బియ్యం సిద్ధంగా ఉన్నాయి. చౌకధరల దుకాణాదారులంతా నిత్యావసరాలకు సంబంధించిన డీడీలు తీసి సిద్ధంగా ఉంచుకున్నారు. గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం, ఇతర సరుకులు తరలించేవారే కరువయ్యారు. సకలం సమ్మెలో ఉండటంతో సంబంధిత అధికారులు సైతం ఏమి చేయాలో పాలుపోక చేతులెత్తేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి నిత్యావసరాలు పూర్తిగా పంపిణీ చేయాల్సి ఉన్నా పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకంపై కూడా సమ్మె ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో అనేక పాఠశాలలు మూతపడ్డాయి. అమృత హస్తం పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. పథకం ప్రారంభించిన సమయంలో అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా కాకపోవడంతో కొంతమంది కార్యకర్తలు ఇళ్ల నుంచి బియ్యం తెచ్చి కొన్ని రోజులు నిర్వహించారు. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండటంతో వారు చేతులెత్తేశారు. అదే సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగడంతో అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయినట్లయింది. ‘అమ్మహస్తం’కు అవస్థలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి అవస్థలు వచ్చిపడ్డాయి. 185 రూపాయలకే 9 రకాల నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి పంపిణీ ప్రక్రియను అట్టహాసంగా ప్రారంభించింది. అమ్మహస్తం ద్వారా అందించే నిత్యావసరాలు నాసిరకంగా ఉన్నా కొన్ని వర్గాలకు చెందినవారు వాటిని వినియోగించుకుంటూనే ఉన్నారు. నిరవధిక సమ్మె ప్రభావం అమ్మహస్తంపై పడింది. నేటి నుంచి సరఫరా చేస్తాం : పౌరసరఫరాల సంస్థ డీఎం చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలు ఈ నెల 8వ తేదీ నుంచి సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం ఉదయభాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పేదలకు అందించే బియ్యం సరఫరా నిలిచిపోయిన విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఆదివారం నుంచి నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా సిబ్బంది పాల్గొనేలా చూస్తామని ఉదయభాస్కర్ వివరించారు. -
ఉద్యమ పర్వంలో వేతనజీవి సాహసం
ఒకటి కాదు.. రెండు కాదు... సుమారు 36 రోజులుగా జిల్లాలో సమైక్యాం ధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతాలు రాకపోయినప్పటికీ పస్తులతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర లక్ష్యం ముందు తమ కష్టాలు బలాదూర్ అంటున్నారు. జీతాలు రాకపోవడంతో దిగువ స్థాయి సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నా.. కుటుంబపోషణ భారమైనా.. పిల్లల చదువులు సక్రమంగా సాగకపోయినా .. అవేవీ లెక్క చేయకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది సమైక్య ఆంధ్ర మహాభారతంలో ఉద్యోగ పర్వం... ఉద్యోగం బాధ్యత, ఉద్యమం ఆత్మగా సాగుతున్న సమైక్య సమరం...ఉద్యమం బాధ్యతను తలకెత్తుకున్న నెలజీతగాళ్ల సాహసం.... హృదయాంతరాళ్లలోంచి పెల్లుబుకిన ధర్మాగ్రహం... కేవలం నాలుగు అంకెల జీతం వారి జీవితం. ఫస్ట్ తేదీ వస్తే పేరుమోసిన ఆడిటర్ల కన్నా తెలివిగా ఆ నాలుగురాళ్లను సర్దుబాటు చేసే స్థితి వారిది. పాలు, నీళ్లు, బియ్యం, పచారీ, గ్యాస్, మందులు, ఫీజులు, కరెంట్ ఫ్యూజులు ఇలా అన్నిటికీ సర్దుబాటు చేసుకోవలసిన పరిస్థితి. బ్యాంకు బ్యాలెన్స్‌లు, అదనపు నిధులు అసలుండని జీవితాలే చాలా మందివి... జీతాలు రాకపోతే బతుకులేమవుతాయని వారు ఆలోచించడం లేదు. అప్పులు చేసైనా, ఆకలి రుచి చూసైనా... ముందుకుసాగుతామని, తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామంటున్నారు వారు. నెలరోజుల పైగా సాగుతున్న సమైక్య ఉద్యమం కారణంగా ఆగస్టు నెల జీతం అందక చాలా మంది అవస్థలుపడుతున్నారు....అప్పులు చేస్తున్నారు. పిల్లలు కిడ్డీ బ్యాంక్‌లు, డబ్బులు దాచుకునే పిడతలు పగులగొడుతున్నారు... ఎన్ని సమస్యలు వచ్చినా వెరువం... సమైక్యం కోసం ముందుకు సాగుతామని ఘంటాపథంగా చెబుతున్నారు... భావితరాల కోసమే... నా పేరు ఎస్. నారాయణ. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖలో అటెండర్‌గా పని చేస్తున్నాను. రాష్ట్ర విభజన ప్రకటన నిర సిస్తూ ఏపీ ఎన్జీఓ ఇచ్చిన పిలుపుమేరకు గత 25 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాను. అయితే ఈ నెల జీతం రాకపోవడంతో అవస్థలు పడుతున్నాం. కుమార్తెకు వివాహం చేయడంతో అప్పు చేశాను. ప్రస్తుతం అది తీర్చే పరిస్థితి లేదు. ఇప్పటివరకు రేషన్ కూడా తెచ్చుకోలేదు. అయితే రాష్ట్రం విడిపోతే భావితరాల భవిష్యత్తు అంధకారం అవుతుందన్న ఉద్ధేశంతో ఈ కష్టాలను ఎదుర్కొని, పోరాటం కొనసాగిస్తున్నాను. విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ మాత్రం సడలం లేదు. రో జురోజుకీ ఉద్యమ తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గ డం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు నిలిపివేసినా... ఎవరూ ఆందోళ న చెం దడం లేదు. ఎన్ని ఇబ్బందులైనా.. సమైక్య సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే సమ్మె వల్ల దిగువస్థాయి ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 23 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో అటెండర్లు, స్వీపర్లు, చిన్న గుమ స్తాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాచ్మెన్ల వంటి చిరుద్యోగులు సుమారు 10 వేల మందికి పైగా ఉన్నారు. వీరంతా సమైక్యాం ధ్రకు మద్దతుగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఈనెల 18న ప్రభుత్వం అత్యసవర సేవలు నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఉద్యోగులు బెదరలేదు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ... సమైక్య సాధన కోసం నిర్విరామంగా నిరసనలు, ఆందోళన చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేసింది. వాస్తవానికి 1వ తేదీ నాటికి వీరికి జీతాలు అం దాల్సి ఉన్నా ... అసలు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చిరు ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయూరు. అప్పు లు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్ధితి నెలకొంది. చాలామంది దిగువ స్థాయి సిబ్బంది పిల్ల ల చదువులు, కుటుంబపోషణ, ఇతర ఖర్చులు ఎలా నెట్టుకు రావాలన్న సందిగ్ధతలో కొట్టుమి ట్టాడుతున్నారు. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవస్థలు వర్ణణాతీతం. వారికి గత నెలలకు సంబంధించి జీతా లు అందకపోవడం, తాజా పరిస్థితులు.. మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఎస్మా ప్రయో గించినా... జీతాలు నిలుపుదల చేసి నా.. ఉద్యమాన్ని వీడి వెళ్లేది లేదని చిరుద్యోగులు స్ప ష్టం చేస్తున్నారు. రాష్ట్ర విచ్ఛిన్నం అయితే పిల్లల భవి ష్యత్తు ఏం అవుతుందోన్న ఆలో చన వారిలో నెలకొంది. ఎన్ని నెలలు జీతాలు రాకపోయినా.. అప్పో సప్పో చేసి కాలం వెల్లదీస్తామని చెబుతున్నారు. -
వాయిదా దిశగా ఏపీసెట్!
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్కడి నుంచి రావలసిన వివరాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయానికి అందలేదు. దీంతో ఈ నెల 10 నుంచి జరగాల్సిన హాల్టిక్కెట్ల జారీ నిలిచిపోయింది. సుమారు 1.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. వాయిదా పడే అవకాశాలు: సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏపీసెట్ వాయిదా పడే అవకాశాలున్నాయి. పరీక్ష కోసం ఆ ప్రాంతంలో 8 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు సుమారు 160 కేంద్రాలు అవసరం ఉన్నట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతంలో విద్యాసంస్థల బంద్ కారణంగా పరీక్ష కేంద్రాల వివరాలు అందలేదని, దీంతో పరీక్షల ప్రక్రియను ప్రారంభించలేక పోతున్నామన్నారు. సెట్ నిర్వహణపై 2రోజులో ప్రభుత్వానికి నివేదికను అందచేస్తామన్నారు. -
తెలంగాణ క్రెడిట్ కోసం పాకులాటలో టి మినిస్టర్స్
-
విజయవాడలో బంద్ విజయవంతం
-
సీమాంధ్రలోమిన్నంటినసమైక్యనిరసనలు
-
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం