ఉద్యమ పర్వంలో వేతనజీవి సాహసం
Published Thu, Sep 5 2013 6:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఒకటి కాదు.. రెండు కాదు... సుమారు 36 రోజులుగా జిల్లాలో సమైక్యాం ధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతాలు రాకపోయినప్పటికీ పస్తులతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర లక్ష్యం ముందు తమ కష్టాలు బలాదూర్ అంటున్నారు. జీతాలు రాకపోవడంతో దిగువ స్థాయి సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నా.. కుటుంబపోషణ భారమైనా.. పిల్లల చదువులు సక్రమంగా సాగకపోయినా .. అవేవీ లెక్క చేయకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇది సమైక్య ఆంధ్ర మహాభారతంలో ఉద్యోగ పర్వం... ఉద్యోగం బాధ్యత, ఉద్యమం ఆత్మగా సాగుతున్న సమైక్య సమరం...ఉద్యమం బాధ్యతను తలకెత్తుకున్న నెలజీతగాళ్ల సాహసం.... హృదయాంతరాళ్లలోంచి పెల్లుబుకిన ధర్మాగ్రహం... కేవలం నాలుగు అంకెల జీతం వారి జీవితం. ఫస్ట్ తేదీ వస్తే పేరుమోసిన ఆడిటర్ల కన్నా తెలివిగా ఆ నాలుగురాళ్లను సర్దుబాటు చేసే స్థితి వారిది. పాలు, నీళ్లు, బియ్యం, పచారీ, గ్యాస్, మందులు, ఫీజులు, కరెంట్ ఫ్యూజులు ఇలా అన్నిటికీ సర్దుబాటు చేసుకోవలసిన పరిస్థితి. బ్యాంకు బ్యాలెన్స్‌లు, అదనపు నిధులు అసలుండని జీవితాలే చాలా మందివి... జీతాలు రాకపోతే బతుకులేమవుతాయని వారు ఆలోచించడం లేదు. అప్పులు చేసైనా, ఆకలి రుచి చూసైనా... ముందుకుసాగుతామని, తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామంటున్నారు వారు. నెలరోజుల పైగా సాగుతున్న సమైక్య ఉద్యమం కారణంగా ఆగస్టు నెల జీతం అందక చాలా మంది అవస్థలుపడుతున్నారు....అప్పులు చేస్తున్నారు. పిల్లలు కిడ్డీ బ్యాంక్‌లు, డబ్బులు దాచుకునే పిడతలు పగులగొడుతున్నారు... ఎన్ని సమస్యలు వచ్చినా వెరువం... సమైక్యం కోసం ముందుకు సాగుతామని ఘంటాపథంగా చెబుతున్నారు...
భావితరాల కోసమే...
నా పేరు ఎస్. నారాయణ. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖలో అటెండర్‌గా పని చేస్తున్నాను. రాష్ట్ర విభజన ప్రకటన నిర సిస్తూ ఏపీ ఎన్‌జీఓ ఇచ్చిన పిలుపుమేరకు గత 25 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాను. అయితే ఈ నెల జీతం రాకపోవడంతో అవస్థలు పడుతున్నాం. కుమార్తెకు వివాహం చేయడంతో అప్పు చేశాను. ప్రస్తుతం అది తీర్చే పరిస్థితి లేదు. ఇప్పటివరకు రేషన్ కూడా తెచ్చుకోలేదు. అయితే రాష్ట్రం విడిపోతే భావితరాల భవిష్యత్తు అంధకారం అవుతుందన్న ఉద్ధేశంతో ఈ కష్టాలను ఎదుర్కొని, పోరాటం కొనసాగిస్తున్నాను.
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ మాత్రం సడలం లేదు. రో జురోజుకీ ఉద్యమ తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గ డం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు నిలిపివేసినా... ఎవరూ ఆందోళ న చెం దడం లేదు. ఎన్ని ఇబ్బందులైనా.. సమైక్య సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే సమ్మె వల్ల దిగువస్థాయి ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 23 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో అటెండర్లు, స్వీపర్లు, చిన్న గుమ స్తాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాచ్‌మెన్‌ల వంటి చిరుద్యోగులు సుమారు 10 వేల మందికి పైగా ఉన్నారు.
వీరంతా సమైక్యాం ధ్రకు మద్దతుగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఈనెల 18న ప్రభుత్వం అత్యసవర సేవలు నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఉద్యోగులు బెదరలేదు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ... సమైక్య సాధన కోసం నిర్విరామంగా నిరసనలు, ఆందోళన చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేసింది. వాస్తవానికి 1వ తేదీ నాటికి వీరికి జీతాలు అం దాల్సి ఉన్నా ... అసలు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చిరు ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయూరు. అప్పు లు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్ధితి నెలకొంది.
చాలామంది దిగువ స్థాయి సిబ్బంది పిల్ల ల చదువులు, కుటుంబపోషణ, ఇతర ఖర్చులు ఎలా నెట్టుకు రావాలన్న సందిగ్ధతలో కొట్టుమి ట్టాడుతున్నారు. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవస్థలు వర్ణణాతీతం. వారికి గత నెలలకు సంబంధించి జీతా లు అందకపోవడం, తాజా పరిస్థితులు.. మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఎస్మా ప్రయో గించినా... జీతాలు నిలుపుదల చేసి నా.. ఉద్యమాన్ని వీడి వెళ్లేది లేదని చిరుద్యోగులు స్ప ష్టం చేస్తున్నారు. రాష్ట్ర విచ్ఛిన్నం అయితే పిల్లల భవి ష్యత్తు ఏం అవుతుందోన్న ఆలో చన వారిలో నెలకొంది. ఎన్ని నెలలు జీతాలు రాకపోయినా.. అప్పో సప్పో చేసి కాలం వెల్లదీస్తామని చెబుతున్నారు.
Advertisement
Advertisement