ఆ రెండు పార్టీల వల్లే విభజన
Published Mon, Oct 21 2013 6:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
పార్వతీపురం రూరల్/సీతానగరం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీ నాయకుల తీరు వల్లే రాష్ట్ర విభజన అనివార్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త కొయ్యూన శ్రీవాణి అన్నారు. ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటం చేయూలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె సమైక్యాంధ్ర జన చైతన్య రథయాత్రలో భా గంగా పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామంలో ను, సీతానగరం మండలంలోని రేపటివలసలోను పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆయూ గ్రామాల్లో జరిగిన సభల్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ మొదటి నుంచీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై విభజనకు సహకరిస్తున్నాయని ఆరోపించారు. విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని చెప్పారు. విభ జనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమె గ్రామస్తులతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల బీసీ సెల్ కన్వీనర్ గుల్ల కన్నంనాయుడు, నాయకులు డి. సూరిబాబు, టి. రవికుమా ర్, తాన్న సంజీవినాయుడు, కిరణ్, సిద్దూ, కొట్టక్కి నారాయణమ్మ, పరమేశ్వరరావు, టి. వెంకటరావు, తుడుము కృష్ణ, బేతా అప్పలనాయుడు, బేతా స్వామినాయుడు, జాకేటి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
పోరాటం ఆపేది లేదు : కడుబండి
గజపతినగరం : రాష్ట్ర విభజన నిర్ణయూన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ దీక్షలను కొనసాగిస్తామని వైఎ స్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా స్థానిక జాతీయ రహదారి వద్ద ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు ఆది వారం కూడా కొనసాగారుు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీల పేరుతో సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నిన రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా విభజనపై నిర్ణయ తీసుకోవడం యూపీఏ ప్రభుత్వానికి తగదని చెప్పారు. శిబిరంలో పార్టీ కార్యకర్తలు లోకారపు ఈశ్వరరావు, మార్పిన గణపతి, పిల్లా పైడిపినాయుడు పెద్దింటి సింహాద్రి కూర్చున్నారు.
ఎస్. కోటలో...
పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నారుు. ఆదివారం నాటి శిబిరంలో వేపాడ మండలం బా నాది గ్రామానికి చెందిన కార్యకర్తలు కలిగొట్లు సూరిదేముడు,గుమ్మడి ముత్యాలనాయుడు, గుమ్మడి స త్యం, బండారు గంగునాయుడు, ఈర్లె పైడినాయుడు, తా నాన సత్యం, సంపర్తి దేముడు, మద్ది అప్పారావు కూర్చున్నారు. వారికి ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వేచలపు చినరామునాయుడు, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ రెహ్మన్, వేమలి రాము, కేత వీరన్న, ఖండిపల్లి పెదనాయు డు, వేచలపు జగ్గుబాబు, గొర్రిపోటు వెంకటరమణ, బొండా రంగారావు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వేచలపు చినరామునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి కుంటుపడుతుం దన్నారు. సమైక్యాంధ్ర సాధనే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రతిఒక్కరూ ఉద్యమంలో పాల్గొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయూలని పిలుపునిచ్చారు.
సమైక్య శంఖారావం వాల్ పోస్టర్ ఆవిష్కరణ
సీతానగరం, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈనెల 26వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో జరిగే సమైక్య శంఖారావం వాల్ పోస్టర్‌ను ఆ పార్టీ అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబీనాయన ఆదివారం అప్పయ్యపేట గెస్ట్‌హౌస్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయం కోసం విడగొడుతున్నారన్నారు. పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్రే తమ పార్టీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాపమ్మవలస సర్పంచ్ ఆర్. జగదీశ్వరరావు, నిడగల్లు మా జీ సర్పంచ్ జి. వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement