కర్ఫ్యూ వెనుక బొత్స హస్తం | botsa satyanarayana hand behind curfew in vizainagaram | Sakshi
Sakshi News home page

కర్ఫ్యూ వెనుక బొత్స హస్తం

Published Thu, Oct 17 2013 4:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

botsa satyanarayana hand behind curfew in vizainagaram

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ విధించడం వెనుక పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను హస్తం ఉందని అఖిలపక్షం నాయకు లు ఆరోపించారు. పార్టీ అధిష్టానం వద్ద మెప్పు పొం దేందుకు మంత్రి బొత్స వ్యూహం మేరకు పట్టణంలో కర్ఫ్యూ విధించారన్నారు. బొత్స తీరు వల్ల పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో అక్రమ అరెస్టులతో పాటు కర్ఫ్యూ ఎత్తి వేయూలని డిమాండ్ చేస్తూ..లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ అధ్యక్షతన ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, జేఏసీల నాయకులు రౌండ్ టేబుల్ సమావే శం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జి ల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ కేవలం ఒక వ్యక్తి ఆస్తులను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కర్ఫ్యూ విధించడం సరికాదన్నారు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో చర్చలు జరపకుండా ఎలా కర్ఫ్యూ ప్రకటిస్తారని ప్రశ్నించారు. జిల్లా అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప మరెవరూ కన్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు కూడా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన జాబితా ప్రకారం జరిగాయని ఆరోపించారు. పోలీసుల అలసత్వమే కర్ఫ్యూకు ప్రధాన కారణమన్నారు. అవసరమైతే తన ఆస్తులు ప్రజలకు రాసి ఇస్తానని ప్రకటించిన బొత్స.. తనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. యువకులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 
 
 ఉద్యమంలో భాగంగా చిన్న శ్రీను ఇంటి ముట్టడికి వెళ్లిన విద్యార్థులను కొట్టడం తో పాటు అక్కడ ఇద్దరు విద్యార్థులు చనిపో యారం టూ వచ్చి వదంతులపై పోలీసులు సరైన సమాధానం చెప్పకపోవడం వల్లే విధ్వంసానికి కారణమైందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి. కామేశ్వరరావు మాట్లాడుతూ పోలీసుల నీడలో వచ్చి వెళ్లిన బొత్సకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎలా తెలుస్తాయన్నారు. కర్ఫ్యూ వల్ల వేలా ది మంది ఉపాధి కోల్పోయూరని చెప్పారు. అరెస్ట్ అయిన వారు ఎక్కడ ఉన్నారో తెలి యక కుటంబసభ్యులు ఆం దోళన చెందుతున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయు డు మాట్లాడుతూ శాంతియుతంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకే కర్ఫ్యూ విధించారన్నా రు. బీజేపీ నాయకుడు పి. అశోక్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు నిరసనగా అన్ని పార్టీల నాయకులు పోరా టం చేయూలని పిలుపునిచ్చారు. 
 
 కాగా అఖిల పక్షం నా యకులు సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పట్టణంలో తక్షణమే కర్ఫ్యూ ఎత్తి వేయాలని...అరెస్టు చేసిన వారిని విడుదల చేయూలని కోరుతూ కలెక్టర్, ఎస్పీకి వినతి పత్రాలు అందజేయూలని నిర్ణరుుంచారు. అధికారులు స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కా వాలని తీర్మానించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు అవనాపు విజయ్, గొర్లె వెంకటరమణ, డా క్టర్ సురేష్‌బాబు,  సీపీఐ నాయకులు బుగత సూరిబా బు, లోక్‌సత్తా పార్టీ నాయకులు దయానంద్, జేఏసీల నాయకులు ఆర్‌ఎస్ జాన్, సత్యనారాయణ, ఉత్తరాంధ్ర దళిత ఐక్య వేదిక నాయకులు భానుమూర్తి,పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement