ఖాకీవనంలో ‘కుల’కలం! | Appointment to Chandrababu Own Caste Candidates in the Police Department | Sakshi
Sakshi News home page

ఖాకీవనంలో ‘కుల’కలం!

Published Sun, Feb 24 2019 3:52 AM | Last Updated on Sun, Feb 24 2019 11:41 AM

Appointment to Chandrababu Own Caste Candidates in the Police Department - Sakshi

సాక్షి, అమరావతి: మాది ఖాకీ‘కులం’.. ప్రజల శాంతి భద్రతలే మా అభి‘మతం’.. మేమంతా పోలీసులం.. ఐక్యతే మా బలం..! గతంలో ఏ పోలీసును కదిలించినా ఇలా తలెత్తుకుని సగర్వంగా చెప్పేవారు. టీడీపీ సర్కారు పుణ్యమా అని సీఎం సామాజిక వర్గానికి చెందిన కీలక అధికారులు ఖాకీ వనంలోను కులం కుంపటి రాజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో కులమతాలకు అతీతంగా కీలక పాత్ర పోషించే పోలీసు శాఖలో కులాలవారీ లెక్కలు తీయడంతోపాటు సొంత సామాజికవర్గం అయితేనే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేస్తుందనే పోకడలు వేళ్లూనుకున్నాయి. పోలీసు శాఖలో అతి తక్కువ సంఖ్యలో ఉన్న సీఎం సామాజిక వర్గానికి చెందిన పోలీసులను అత్యధికంగా కీలక (ఫోకల్‌) పోస్టింగ్‌ల్లో నియమించడం ఇందుకు నిదర్శనం. పోలీసుల్లో ఎక్కువ శాతం ఉన్న ఎస్సీ, బీసీ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారికి అప్రధాన (నాన్‌ ఫోకల్‌) పోస్టులు అప్పగించారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదంతా ఎన్నికల్లో లబ్ధి కోసమేనని ఓ రిటైర్డ్‌ అధికారి పేర్కొన్నారు.

మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు ప్రభుత్వం తమవారిని ఏరికోరి బదిలీలు చేసేసింది. సొంత జిల్లాకు చెందిన వారు, ఒకే చోట మూడేళ్లు విధులు పూర్తి అయిన వారు, వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల విధులు నిర్వహించరాదనే నిబంధనలకు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలను అనుసరించి బదిలీలు చేపట్టాలని కొద్ది రోజుల క్రితం ఎన్నికల కమిషన్‌ నుంచి పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. దీన్ని ముందే ఊహించిన టీడీపీ సర్కారు రెండు నెలల ముందే పోలీస్‌ శాఖలో అనుకూలమైన బదిలీలకు తెరతీసింది. కీలక పోస్టులను  సొంత మనుషులతో సర్దేశారు. పార్టీకి ఉపయోగపడతారనుకునే చోట ఐపీఎస్‌ల నుంచి ఎస్సై స్థాయి వరకు ఏరికోరి నియమించుకున్నారు. బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన ఐపీఎస్‌లను స్వయంగా చంద్రబాబు పిలిపించుకుని మరీ మాట్లాడి వారికి మేలు చేసినట్టు చెబుతూ రుణం తీర్చుకోవాలనే సంకేతాలు ఇవ్వడం గమనార్హం. పెద్దఎత్తున చేపట్టిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల బదిలీల్లోను అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నారు.

డీఎస్పీలే కీలకం...
ఎన్నికల సమయంలో డీఎస్పీలు కీలక పాత్ర పోషిస్తారని గుర్తించిన సర్కారు తమకు అనుకూలంగా ఉన్నవారిని కీలక పోస్టుల్లో నియమించిందనే విమర్శలున్నాయి. వాస్తవానికి పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు ఆమోదంతో డీఎస్పీల బదిలీలు నిర్వహిస్తారు. ఇందులో డీజీపీ, శాంతిభద్రతలు, సీఐడీ, ఇంటెలిజన్స్‌ ఏడీజీలు ఉంటారు. డీఎస్పీల పనితీరును ప్రతి నెలా సమీక్షిస్తుంటారు. బదిలీల సమయంలో డీఎస్పీలకు ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలనే అంశంపై నలుగురు అధికారులు ఉండే బోర్డులో మెజారిటీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో డీజీపీదే తుది నిర్ణయంగా చెలామణి అవుతుంది. గత రెండు నెలల్లో దాదాపు 56 – 60 మంది డీఎస్పీల బదిలీలు జరిగాయి. వీరిలో సీఎం సొంత సామాజికవర్గం, సొంత మనుషులు, వీరవిధేయులకే కీలక పోస్టింగ్‌లు ఇచ్చారనేది బహిరంగ రహస్యం. డీఎస్పీల బదిలీల్లోను ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో ఇంటెలిజన్స్‌ ఏడీజీ సిఫారసులకే పెద్దపీట వేశారనే విమర్శలున్నాయి. 

అయిన వారి కోసం అడ్డదారులు..
రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి దాదాపు 104 పోలీస్‌ సబ్‌ డివిజన్లతోపాటు ప్రతి జిల్లాకు ఒక్కో ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీలు కీలకంగా ఉంటారు. ఆయా పోస్టుల్లో డైరెక్ట్‌ డీఎస్పీలను నియమించాలి. చిత్రం ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా వెయిటింగ్‌లో ఉన్న దాదాపు 34 మంది డీఎస్పీల్లో చాలా మందికి కొద్ది రోజుల క్రితం జరిగిన బదిలీల్లో అప్రధాన పోస్టు(లూప్‌లైన్‌)లోకి నెట్టేశారు. కానీ ఆరోపణలున్నవారికి, సూపర్‌ న్యూమరీ పోస్టులు పొందిన వారికి మాత్రం లా అండ్‌ ఆర్డర్‌ డీఎస్పీ, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచి పోస్టులు కేటాయించడం గమనార్హం. కీలక పోస్టుల్లో దాదాపు 39 మందిని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారితోనే నింపారనే విమర్శలున్నాయి.

ప్లాన్‌ ‘ఏ’.. ప్లాన్‌ ‘బీ’..
టీడీపీ సర్కారు ప్లాన్‌ ‘ఏ ’.. ప్లాన్‌ ‘బీ’ అమలు చేస్తోందని పోలీసు యూనియన్‌ మాజీ నేత ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల పరిస్థితిని కల్పించేలా పోలీసులు వ్యవహరించడం ప్లాన్‌ ‘ఏ’ గానూ, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో పోలీసులు అధికార టీడీపీకి సహకరించం  ప్లాన్‌ ‘బి’గానూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ యోగానంద్‌లు ఈ ప్లాన్‌ల అమలులో తలమునకలైనట్టు ఐపీఎస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో భాగంగానే పోలీసు శాఖలో మునుపెన్నడూ లేనివిధంగా కులాలవారీగా లెక్కలు తీసి సానుకూలంగా ఉండే సామాజిక వర్గాలకే కీలక పోస్టింగ్‌లు ఇచ్చారని పేర్కొంటున్నారు.

సూపర్‌ న్యూమరీ పేరుతో కీలక పోస్టులా?
సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయిస్తే అన్ని సామాజిక వర్గాలకు అవకాశం వస్తుంది. అందుకు విరుద్ధంగా సొంత సామాజికవర్గానికి చెందిన ఎక్కువ మందికి మేలు చేకూర్చేలా కొందరు సీఐలకు డీఎస్పీ క్యాడర్‌ ఇస్తూ సూపర్‌ న్యూమరీ అవకాశాన్ని వాడుకున్నారు. ఇలా సొంత మనుషులకు కీలక పోస్టులు అప్పగించడం రాజకీయ కోణం ఉందని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి వ్యాఖ్యానించారు. కొత్తగా డీఎస్పీ పోస్టులు పెంచకుండా ఉన్న సీఐ పోస్టుల స్థానంలో సూపర్‌ న్యూమరీ పేరుతో డీఎస్పీ క్యాడర్‌ ఇవ్వడం గమనార్హం. సూపర్‌ న్యూమరీ పేరుతో అవకాశం ఇచ్చే వారికి ప్రధాన(ఫోకల్‌) పోస్టులు ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. వారికి ట్రాఫిక్‌ తదితర నాన్‌ ఫోకల్‌ పోస్టులు కేటాయించాల్సి ఉంది. కానీ వడ్డించే వాడు మనోడైతే పర్లేదు అన్నట్టుగా సూపర్‌ న్యూమరీ పేరుతో ఇటీవల 18 మందిని డీఎస్పీలుగా అప్‌గ్రేడ్‌ చేసి శాంతి భధ్రతలు, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచి తదితర కీలక పోస్టుల్లో నియమించుకోవడం గమనార్హం. వీరిలో ఏకంగా 14 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం. 2014లో జేవీ రాముడు డీజీపీగా ఉండగా డీఎస్పీల ప్రమోషన్‌ వివాదాల నేపథ్యంలో ఏకంగా 169 వరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు ఇచ్చుకోవచ్చని నిర్ణయించారు. అయితే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అప్పటి నుంచి సీనియారిటీ ఖరారు విషయంలో ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకొని అమలు చేయలేకపోయింది. 

బాబు సామాజికవర్గానికే అగ్రతాంబూలం..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రయోజనాల కోసం పోలీసు శాఖలో సొంత సామాజికవర్గానికి అగ్రతాంబులం కల్పించడంపై సోషల్‌ మీడియాలో సైతం అధికారుల జాబితా హల్‌చల్‌  చేస్తోంది. ఈ జాబితాలో 43 మంది ఉండగా ఇంకా పలుచోట్ల సీఎం సామాజిక వర్గానికి చెందిన వారిని కీలక పోస్టుల్లో నియమించుకోవడం గమనార్హం. 

కీలక స్థానాల్లో సీఎం సామాజిక వర్గం అధికారులు
ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌
యోగానంద్‌ (రిటైర్డ్‌ ఐపీఎస్, ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ ఓఎస్డీ)
మాధవరావు (రిటైర్డ్‌ ఏఎస్పీ, ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌టెన్షన్‌పై పనిచేస్తున్నారు)
ఎం.మధుసూధనరావు (రిటైర్డ్‌ డీఎస్పీ, ఎక్స్‌టెన్షన్‌పై పనిచేస్తున్నారు)
ఘట్టమనేని శ్రీనివాసరావు, శాంతిభధ్రతల కోఆర్డినేషన్‌ డీఐజీ(డీజీపీ కార్యాలయం)
దామోదర్‌ (విజయనగరం ఎస్పీ)
కోయ ప్రవీణ్‌ (ప్రకాశం ఎస్పీ)
ఎన్‌బీఎం మురళీకృష్ణ (నెల్లూరు ఎస్‌డీపీవో)
బాబూప్రసాద్‌ (గూడురు)
అమర్నాధ్‌నాయుడు (ఇంటెలిజన్స్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌)
టి.రాధేష్‌ మురళీ (ఒంగోలు ఎస్‌డీపీవో)
ఎన్‌.యుగంధర్‌బాబు (పలమనేరు ఎస్‌డీపీవో)
నాగేశ్వరరావు (తిరుపతి ఏసీపీ)
అంకినీడు ప్రసాద్‌ (విజయవాడ ఏసీపీ)
కె.రమేష్‌బాబు (విజయవాడ ఏసీపీ)
జి.రామకష్ణ (మంగళగిరి ఏసీపీ)
జి.పూర్ణచంద్రరావు (విశాఖ ఏసీపీ)
ఎస్‌.వెంకటేశ్వరరావు (కొవ్వూరు ఎస్‌డీపీవో)
ఏఎస్‌సీ బోస్‌ (నందిగామ ఎస్‌డీపీవో)
నిమ్మగడ్డ రామారావు (రాజమండ్రి డీఎస్పీ)
బాచుపల్లి శ్రీనివాసరావు (కర్నూలు ఎస్‌డీపీవో)
డి.శ్రావణ్‌కుమార్‌ (ఇంటెలిజన్స్‌ డీఎస్పీ)
నర్రా వెంకటేశ్వరరావు (రాజమండ్రి ఇంటెలిజెన్స్‌)
గీత (విజయవాడ ఇంటెలిజెన్స్‌)
చెంచుబాబు (నెల్లూరు ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ)
రామాంజనేయులు (గుంటూరు స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ)
జాస్తి వెంకటరమణ (గుంటూరు స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ)
ఎన్‌టీవీ రామ్‌కుమార్‌ (అనంతపురం స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ)
నున్న మురళీకష్ణ (కొవ్వూరు ఎస్సీ, ఎస్టీసెల్‌ డీఎస్పీ)
మహేష్‌ (గుడివాడ ఎస్‌డీపీవో)
చౌడేశ్వరి (అనంతపురం ఏఎస్పీ)
గుంటుపల్లి శ్రీనివాసరావు (విశాఖ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ)
ఉమామహేశ్వరరావు (కృష్ణా జిల్లా స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ)
రాయపాటి శ్రీనివాస్‌ (గుంటూరు ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ)
విక్రమ్‌ శ్రీనివాసరావు (ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ)
వీవీ నాయుడు (ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ)
ఏవీఆర్‌బీ ప్రసాద్‌ (డీఎస్పీ)
వైటీ నాయుడు (గుంటూరు అర్బన్‌ ఏఎస్పీ)
భక్తవత్సలం(ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ)
కేశప్ప (తుళ్లూరు డీఎస్పీ)
సుబ్బారావు (ఎస్‌బీ చిత్తూరు)
నాయుడు (విజయవాడ టాస్క్‌ఫోర్స్‌)
బి.నాగేశ్వరరావు (ఏసీబీ డీఎస్పీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement