ఆర్మీ ర్యాలీలో రెండో రోజు గందరగోళం
విజయనగరం :
ప్రణాళికా లోపం..నిధుల కొరతతో అరకొర ఏర్పాట్లు..జిల్లా యంత్రాంగం, ఆర్మీ అధికారుల మధ్య సమన్వయ లోపం..ఉద్యోగాల కోసం వేలాదిగా తరలివస్తున్న నిరుద్యోగ యువత.. వెరసి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగం కోసం గంపెడాశతో వస్తున్న అభ్యర్థులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
జిల్లా కేంద్రం లోని పోలీస్ బ్యారెక్స్‌లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో రెండవ రోజు ఆదివా రం ఉదయం ఎంపికలు జరిగే మైదానంలోకి వెళ్లాలనే ఆత్రుతతో అభ్యర్థుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురి కి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా..మరో 12 మందికి స్వల్పగాయాలయ్యాయి.
ర్యాలీలో రెండవ రోజు తొక్కిసలాట
గతంలో జిల్లాలో రెండు సార్లు ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించారు. అయితే ప్రస్తు త ఎంపికలు జరుగుతున్నా పోలీస్ బ్యారెక్స్‌లో కాకుండా పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న విజ్జిస్టేడియంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిపేవారు. అక్కడ మైదానం లోపలతో పాటు బయట భాగంలోనూ ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న తోపులాట లు మినహా ర్యాలీ ప్రశాంతంగానే సాగేది. ప్రధానంగా అభ్యర్థులు ఒక్కక్కొరుగా మైదానంలోకి వెళ్లేందుకు బయట భాగంలో 500 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసేవారు.
దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు అవకాశం ఉండేది. అదేవిధంగా మైదానం లోపల భాగంలో ధ్రువీకరణ పత్రాల పరిశీల న, శరీర దారుఢ్య పరీక్షల నిర్వహణలో పక్కా ప్రణాళికతో నిర్వహించి విజయవంతంగా ముగించారు. అయితే ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున నిర్వహిస్తున్న ర్యాలీలో ఈ తరహా ఏర్పాట్లు లేకపోవడంతో అభ్యర్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ర్యాలీలో పాల్గొనేందుకు ముందురోజు రాత్రికే జిల్లాకు చేరుకుంటున్న అభ్యర్థులు మైదానం బయట ఉన్న రోడ్డుపై ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు అధికారులు 400 మందికి ఒక బారికేడ్ చొప్పు న ఏర్పాటు చేశారు.
వారిని క్యూలో లోపలికి అనుమతించాలని అధికారులు భావించారు. ర్యాలీ ప్రారంభం రోజునే అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించేముందు తొక్కిసలాట జరిగిం ది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అయితే రెండవ రోజు సుమారు 6,500 మంది అభ్యర్థులు తరలిరావడంతో మళ్లీ తొక్కిసలాట జరిగింది. అభ్యర్ధులు ముందుగా మైదానంలో కి వెళ్లాలనే ఆత్రుతతో బారికేడ్లను విరగొట్టి ముందున్న అభ్యర్థులను తొక్కుకుంటూ మైదానంలోకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పలువురు అభ్యర్థులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ర్యాలీ ప్రారంభం రోజే జరిగిన స్వల్ప ఘటనను అటు పోలీసు, ఇటు ఆర్మీ అధికారులు గుణపాఠంగా తీసుకోకపోవడంతో రెండవ రోజు పరిస్థితి తీవ్రరూపం దాల్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ముగ్గురి పరిస్థితి విషమం:
ఆర్మీ ర్యాలీకి హాజరైన శ్రీకాకుళం జిల్లా పోలాకి కి చెందిన టి.అప్పలనాయుడు వెన్నుపూస కాస్త దెబ్బతినడంతో పరిస్థితి కాస్త విషమించదని భావించిన తిరుమల ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్న సమయంలో అభ్యర్థికి మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖ తరలించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వంగరకు చెందిన కె.మురళీమనోహర్, పలాసకు చెందిన కె.శంకర్‌లకు మాత్రం తిరుమల ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలకు ఎటువంటి ముప్పులేదని సెట్విజ్ సీఈఓ పి.దుర్గారావు తెలిపారు. స్వల్ప గాయాలపాలైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డుంకూరు గ్రామానికి చెందిన యు.రమేష్, ఉర్లాంకు చెందిన డోలా మధు. సోంపేటకు చెందిన బి.శ్రీనివాసరావు, పలాస మండలం చిన్న గురుదాసుపురానికి చెందిన ఎస్. భాస్కరరావు,
సంతబొమ్మాళి మండలం మర్రిపాడుకు చెందిన ఎన్.ధన్‌రాజు, నందిగాం మండలం ఖజోలాకు చెందిన పి. యాకరవి, ఇచ్ఛాపురానికి చెందిన పి.మధు, విజయనగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన పి. కుమార్, కె.అప్పలరాజు, మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన రవికుమార్‌ల తో పాటు విశాఖ జిల్లా తగరపువలసకు చెంది న జి.కేశవ, గాజువాక జీఏ కాలనీకి చెందిన ఎన్.నాగేంద్రబాబులను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు.