పకడ్బందీగా పోలింగ్‌ ఏర్పాట్లు | arrangements completed for mlc elections | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పోలింగ్‌ ఏర్పాట్లు

Published Tue, Mar 7 2017 3:57 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

పకడ్బందీగా పోలింగ్‌ ఏర్పాట్లు - Sakshi

పకడ్బందీగా పోలింగ్‌ ఏర్పాట్లు

► శాసనమండలి ఎన్నికలపై సీఈఓ భన్వర్‌లాల్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : శాసనమండలి గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి నిలిపి వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ప్రచారాలు జరగకుండా చూడాలన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి డ్రైడే పాటిస్తూ అన్ని లిక్కర్‌షాపులు మూయించాలని చెప్పారు.

ఈనెల 9న జరగనున్న పోలింగ్‌ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా సెలవులు మంజూరు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల మార్పుల గురించి ప్రజలకు ముందే తెలియజేయాలన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ప్రచురణకు సంంధించిన వివరాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లాలోని ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులతో సమీక్షించాలని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 78,168 పట్టభద్రుల ఓటర్లు ఉండగా, ఇప్పటికి 47 వేల స్లిప్పులు పంపిణీ చేశామన్నారు.

అలాగే 5970 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా, 3600 స్లిప్పులు పంపిణీ చేశామని చెప్పారు. పది పోలింగ్‌ కేంద్రాల మార్పు కోసం ఎన్నికల కమిషన్‌ను కోరగా, తొమ్మిదింటికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాల జాబితాను రూపొందించామని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులు ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి సరఫరా చేసే మెటీరియల్‌ కిట్స్‌ను తయారు చేశామన్నారు. ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 1338 తుపాకులు డిపాజిట్‌ చేశారని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. సమావేశంలో జేసీ శ్వేత తెవతీయ, జేసీ–2 నాగేశ్వరరావు, డీఆర్వో నరసింహారావు, ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం, వీరబ్రహ్మయ్య, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement