హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో 82.38శాతం ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత కుమార్ సింగ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఇద్దరు వీడియో కెమెరామెన్‌లతో వీడియోగ్రఫీ చేయించినట్లు తెలిపారు.
హైదరాబాద్ అంబర్‌పేట్ ఇండోర్‌స్టేడియం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించామని పేర్కొన్నారు. ఏ పోలింగ్ స్టేషన్‌లోనూ ఏవిధమైన సమస్యలు తలెత్తలేదని ఆయన తెలిపారు. అంబర్‌పేట్ స్టేడియంలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని అద్వైత కుమార్ సింగ్ తెలిపారు.
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
Published Sun, Mar 19 2017 8:07 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
Advertisement