కేజ్రివాల్ పై ఇంక్ పడింది!
వారణాసి లో ర్యాలీ నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రివాల్ చేదు అనుభవం ఎదురైంది. ర్యాలీలో మోడీ మద్దతు దారులు అడుగడుగున కేజ్రివాల్ కు వ్యతిరేక నినాదాలతో అడ్డుతగిలారు. మోడీ మద్దతుదారులు కేజ్రివాల్ పై ఇంక్ చల్లి నిరసన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ నుంచి రైలులో వారణాసి చేరుకుని ర్యాలీలో నిర్వహించారు. ర్యాలీలో కేజ్రివాల్ మాట్లాడుతూ.. మోడీ ఓడించి తీరుతాను అని అన్నారు.
మోడీతో పోరాటం చాలా చిన్న విషయం, అవినీతి నుంచి దేశాన్ని కాపాడటమే తన ముందు ఉన్న అతిపెద్ద సమస్య అని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ మోసగాడు అంటూ మోడి మద్దతుదారులు నినాదాలు చేశారు. మోడీ మద్దతు దారులను నిలవరించడం పోలీసులు పెద్ద తలనొప్పిగా మారింది.