కనీస వేతనం 10వేలు ఇవ్వాలి | at least given to 10,000 | Sakshi
Sakshi News home page

కనీస వేతనం 10వేలు ఇవ్వాలి

Published Tue, Feb 18 2014 3:01 AM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM

కనీస వేతనం 10వేలు ఇవ్వాలి - Sakshi

కనీస వేతనం 10వేలు ఇవ్వాలి


 కనీస వేతనం 10వేలు ఇవ్వాలి
 కారేపల్లి : అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తు..సోమవారం కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో అంగన్‌వాడీలు  రిలే దీక్షలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కారేపల్లి ప్రాజెక్టు పరిధిలోని కామేపల్లి, కారేపల్లి మండలాల అంగన్‌వాడీలు బస్టాండ్ సెంటర్ లో మానవహారాన్ని నిర్మించారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ఎస్.నాగమణి, సీఐటీయూ నాయకులు కె.నాగేశ్వరరావు, నరేందర్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 అంగన్‌వాడీ కార్యకర్తల ర్యాలీ  
 కొణిజర్ల: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొణిజర్లలో అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.  ఈ నెల 17 నుంచి 22 వరకు అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేస్తున్నట్లు  సీఐటీయు మండల అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్,అనుమోలు రామారావు ప్రకటించారు. నేడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement