ఆత్మకూరు అభివృద్ధే ధ్యేయం
ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి
సోమశిల: ఆత్మకూరు నియోజకవ ర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాపూరు వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదట ముస్తాపురంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తనను, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తన తండ్రి రాజమోహన్‌రెడ్డిని ఎంతో ఆదరించారని తెలిపారు. తనకు నిధులు లేకపోయినా ఎంపీ నిధులతో పాటు జెడ్పీ చైర్మన్ నిధులతో అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
అనంతసాగరం మండలంలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రాపూరు వెంకట సుబ్బారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ సం దర్భంగా వరికుంటపాడు ప్రజలు వీరిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శోభ, జెడ్పీటీసీ సభ్యులు పెయ్యల సం పూర్ణ, బులగాకుల అనిల్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌పేట మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మందా రామచంద్రారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి బిజివేముల ఓబులరెడ్డి, నాయకులు అక్కలరెడ్డి అంకిరెడ్డి, బుట్టి వెంకట సుబ్బారెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, రాపూరు సుబ్బారెడ్డి, అల్లంపాటి కుప్పారెడ్డి, పాతపాటి పెంచలరెడ్డి, బొమ్మతట్టు మస్తాన్, రాపూరు బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.