సామాన్యుడి చేతిలో ఓటు వజ్రాయుధం. నేతల తల రాతలు మార్చాలన్నా.. నచ్చిన నాయకుడిని ఎంచుకోవాలన్నా ఓటే మూలం. ఐదేళ్ల పాటు పీఠంపై ఉండే పాలకులను ఎన్నుకునేందుకు ఇది సువర్ణావకాశం. ఈ క్రతువులో దిగ్విజయంగా పాల్గొనాలంటే ఓటరు జాబితాలో పేరు ఉండాల్సిందే. ఇన్నాళ్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి పేజీలకు పేజీలు తిరగేసి జాబితాలో పేరు చూసుకునేందుకు కష్టాలు పడాల్సి వచ్చేది. యువకులు వీలున్నా వెళ్లలేకపోతుండగా, వృద్ధుల పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది.. అక్కడికి వచ్చే వారికి సమాధానం చెప్పలేక కోపగించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.
చిత్తూరు కలెక్టరేట్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫారం–7 ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఓట్లు తొలగించేందుకు కొందరు కుట్రపన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమకు ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటి పట్టునే ఉండి జాబితాను సరిచూసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిం చింది. పేరు, పోలింగ్ కేంద్రం, చిరునామా వంటి వివరాలన్నింటినీ ఇంటి వద్దే ఉండి తెలుసుకోవచ్చు. టెక్నాలజీపై పట్టులేని వారికోసం 1950 కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ నంబర్‌కు కాల్‌చేసి కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఎలా అంటారా..మీరే చదవండి.. మీ ఓటు చూసుకోండిలా..
♦ గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి http://ceoandhra.nic.in పేజీలో లాగిన్ అవ్వాలి.
♦ వెంటనే రాష్ట్రాల ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్‌పేజీ కనిపిస్తుంది.
♦ సెర్చ్ యువర్ నేమ్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అసెంబ్లీ నియోజకవర్గం అనే ఆప్షన్ వస్తుంది.
♦ ఒకవేళ వెబ్ పేజీ హిందీ పేజీలో ఉంటే ట్రాన్స్‌లేట్ ఆప్షన్స్‌ను ఎంపిక చేస్తే ఇంగ్లిష్‌లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి.
♦ తర్వాత పేజీలో మీ పేరు, తండ్రి, భర్త పేరు, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎంపిక చేసుకోవాలి.
♦ వివరాలన్నీ నింపిన తర్వాత వెబ్‌పేజీకి కుడివైపు కింద భాగంలో చప్టా (అల్ఫాబెట్స్, అంకెలతో ఉంటుంది)ను నమోదు చేయాలి.
♦ చివరిగా సెర్చ్ బటన్‌ను క్లిక్ చేయాలి.
♦ వెంటనే మీరు పైన నింపిన వివరాలతో పాటు మీ ఓటరు సంఖ్య, ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం చిరునామా సులువుగా తెలిసిపోతాయి.
♦ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే ప్రతి ఒక్కరూ ఫోన్‌లోనే వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అందుకోసం Vౖఖీఉఖఏఉఔ్కఔఐNఉ అనే యాప్‌ను విడుదల చేశారు. ఆ యాప్‌లో పేరు, తండ్రిపేరు, వయస్సు, అసెంబ్లీ నియోజకవర్గం నమోదు చేస్తే చాలు ఓటు ఉందో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటు ఉంటే అదే యాప్ ద్వారా ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలి
త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చివ రి అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికి ఓటు హక్కు పొందని వారు ఈనెల 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటు నమోదు కోసం ప్రచారం చేశాం. కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం.– పీఎస్.గిరీష,జిల్లా డెప్యూటీ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్
కొత్తఓటు నమోదు ఈనెల 15 వరకే
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో చివరి అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు ఆఖరి అవకాశాన్ని ఇచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఎన్నికల్లో అవకాశం ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ద్వివేది వెల్లడిం చారు. జిల్లాలో ఇప్పటికీ ఓటు నమోదు చేసుకోని వారు, రకరకాల కారణాలతో ఓటు లేని వారు ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఈ నెల 15వ తేదీ వరకు నూతనంగా ఓట్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 01 నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏయే ఫారంలు దేనికోసం..
ఓటరుగా నమోదయ్యే వారు, ఇప్పటికే ఓటు ఉండి చేర్పులు మార్పులు చేసుకోవాల్సిన వారు ఏయే ఫారంను దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
♦ ఫారం–6 : నూతన ఓటు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారిన వారి కోసం.
♦ ఫారం–7: ఓటు తొలగింపు, ఆక్షేపణలు.
♦ ఫారం–6ఏ: ఓవర్‌సిస్ ఓటర్ నమోదు
♦ ఫారం 8: పేరు తదితర వివరాల సవరణ కోసం.
♦ ఫారం 8 ఏ : నియోజకవర్గం పరిధిలోని నివాసం మార్పుకోసం దరఖాస్తులను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment