మాట్లాడుతున్న కలెక్టర్ భాస్కర్
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయమై ఓటర్లలో చైతన్యం బాగా వచ్చిం దని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆయన సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తుది ఓటర్ల జాబితా వెల్లడించిన తర్వాత ఏకంగా రెండున్నర లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో విశాఖ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు తీసుకున్న దరఖాస్తుల్లో 1,81,189 మంది కొత్తవారికి ఓటుహక్కు కల్పిం చామని ఆయన చెప్పారు. తుది ఓటర్ల జాబితా సమయానికి 32,80,028 ఓట్లు ఉండగా, తాజాగా పెరిగిన ఓటర్లను బట్టి ఈ సంఖ్య 34,61,217కు చేరిందన్నారు. మరో 90 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, ఈనెల 25 వరకు వీటిని పరిశీలించే అవకాశం ఉండడంతో ఏప్రిల్ 11న ఓటుహక్కు వినియోగించుకునే తుది ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 15వ తర్వాత కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని, కానీ వాటిని ఎన్ని కల తర్వాతే పరిశీలించి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు.
ఊహించని స్పందన..
రానున్న ఎన్నికల్లో కొత్తగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్‌లతో పాటు ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించి న మాక్ పోలింగ్‌కు ఊహించని స్పందన లభించిందని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. మార్చి ఒకటి నుంచి 10 వరకు జిల్లాలోని 4052 పోలింగ్ స్టేషన్లలో డెమోలు నిర్వహించామన్నారు. సుమారు 13.50లక్షల మంది అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 40 శాతం మంది ఓటు హక్కు వినియోగంపై అవగాహన పొందారన్నారు. ఇంతపెద్ద సంఖ్యలో డెమోలో పాల్గొన్న ఓటర్లు న్న జిల్లాగా కూడా విశాఖ రికార్డు సృష్టిం చిందన్నారు. పరిస్థితి చూస్తుంటే గతంలో నమోదైన పోలింగ్ శాతాన్ని అధిగమించి నూరుశాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏలూరులో ఉన్న తన ఓటును విశాఖకు మా ర్పించుకున్నానని, ఎన్నికల్లో విధిగా ఓటుహక్కు వినియోగించుకుంటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకునేలా పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు.
42 వేల మందికి పోస్టల్ బ్యాలెట్
ఎన్నికల విధుల్లో పాల్గొనే 32వేల మంది పోలింగ్ సిబ్బం దితో పాటు బందోబస్తు నిర్వహించే మరో 10 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని కలెక్టర్ వెల్లడిం చారు. వారు తాము ఏ కేంద్రంలో పనిచేయాలో ఇచ్చిన నియామక పత్రాన్ని జతచేసి కౌంటింగ్‌కు గంట ముందు వరకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సారి సాయంత్రం ఆరు వరకు పోలింగ్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని పెంచారని కలెక్టర్ వెల్లడించారు. అరుకు, పాడేరు మిన హా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరి«ధిలో ఉద యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వర కు పోలింగ్‌కు అనుమతిస్తారన్నారు. అదే అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్‌కు అనుమతించనున్నారన్నారు. అంతే కాదు గతంలో మాదిరిగా పోలింగ్ అనంతరం అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను స్థానికంగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారని, మర్నాడు వాటిని ప్రత్యేక బందోబస్తుతో జిల్లా కేంద్రానికి తరలిస్తారన్నారు.
10,105 మంది బైండోవర్
ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలకులుగా 18 మందిని నియమించారన్నారు. 53 ప్‌లైయింగ్ స్క్వాడ్లు, 51 స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు, 46 మోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్‌లు, 36 వీడియో సర్వలెన్స్ టీమ్‌లు, 18 చొప్పున వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. 399 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించగా, వారందరికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. 805 లైసెన్సడ్ ఆయుధాల్లో 650 ఆయుధాలను ఇప్పటి వరకు డిపాజిట్ చేశారన్నారు. 2595 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేశామని చెప్పారు. ఇప్పటి వరకు 10,103 మందిని బైండోవర్ చేశామన్నారు. కాగా ఇప్పటి వరకు 32,254.25 లీటర్ల మద్యం, రూ.22,50,630 నగదు, 80 వాహనాలను సీజ్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు టటటటటటట13,651 పోస్టర్లు, 6644 హోర్డింగ్లు తొలగించామని, 931 విగ్రహాలకు ముసుగులు వేశామని, వివిధ పార్టీలకు చెందిన 13,511 జెండాలను, అలాగే 4314 వాల్ పెయింటింగ్లను కూడా తొలగించామన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment