katamneni bhaskar
-
యూకే నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా
సాక్షి, విశాఖపట్నం: యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అయితే అది ఇంకా కొత్త వైరస్ అని నిర్ధారణ కాలేదని చెప్పారు. వీరి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా గుంటూరులో ఇద్దరికీ కరోనా సోకిందని, వీరందరినీ కోవిడ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త వైరస్ గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, దాని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా) యూకే నుంచి గత నెల రోజుల్లో 1214 మంది ఏపీకి రాగా ఇందులో 1158 మంది అడ్రస్‌లను గుర్తించినట్లుగా కాటంనేని భాస్కర్ వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 1101 మంది క్వారంటైన్లో ఉన్నారన్నారు. 56 మంది ప్రయాణీకుల అడ్రస్‌లు దొరకలేదని చెప్పారు. యూకే నుంచి వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. యూకే నుంచి ఏపీకి వచ్చినవారు కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాటు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు సైతం పాటించాలని కోరారు. (చదవండి: కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’) -
ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని.. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని.. ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిశ్చార్జ్ చేసిన వారు తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. వారికి ఆహారం, మందులు అందించాలని.. డిశ్చార్జ్ అయిన వారిని కూడా అబ్జర్వేషన్లో ఉంచాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏలూరులో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 104, 108కి కాల్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) ఆందోళన చెందవద్దు: పేర్ని నాని ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘డిశ్చార్జ్ చేసిన బాధితులను నెలపాటు పర్యవేక్షించాలని.. బాధితులకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అస్వస్థతకు గల కారణాలపై పరిశోధనకు కేంద్ర బృందాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం కూడా రాబోతుంది. బాధితులు ఆందోళన చెందవద్దు’ అని తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 425 కేసులు నమోదు కాగా.. 222 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 16మంది విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాము. అస్వస్థతకు గురైన వారికి అన్ని వైరల్ టెస్టులు చేశాం. నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం.. రిపోర్టులు రావాలి. సీఎంబీకి కూడా నమూనాలు పంపామని’ తెలిపారు. -
కొత్త ఓటర్ల నమోదులో విశాఖ నంబర్ 1
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయమై ఓటర్లలో చైతన్యం బాగా వచ్చిం దని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆయన సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తుది ఓటర్ల జాబితా వెల్లడించిన తర్వాత ఏకంగా రెండున్నర లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో విశాఖ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు తీసుకున్న దరఖాస్తుల్లో 1,81,189 మంది కొత్తవారికి ఓటుహక్కు కల్పిం చామని ఆయన చెప్పారు. తుది ఓటర్ల జాబితా సమయానికి 32,80,028 ఓట్లు ఉండగా, తాజాగా పెరిగిన ఓటర్లను బట్టి ఈ సంఖ్య 34,61,217కు చేరిందన్నారు. మరో 90 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, ఈనెల 25 వరకు వీటిని పరిశీలించే అవకాశం ఉండడంతో ఏప్రిల్ 11న ఓటుహక్కు వినియోగించుకునే తుది ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 15వ తర్వాత కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని, కానీ వాటిని ఎన్ని కల తర్వాతే పరిశీలించి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఊహించని స్పందన.. రానున్న ఎన్నికల్లో కొత్తగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్లతో పాటు ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించి న మాక్ పోలింగ్‌కు ఊహించని స్పందన లభించిందని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. మార్చి ఒకటి నుంచి 10 వరకు జిల్లాలోని 4052 పోలింగ్ స్టేషన్లలో డెమోలు నిర్వహించామన్నారు. సుమారు 13.50లక్షల మంది అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 40 శాతం మంది ఓటు హక్కు వినియోగంపై అవగాహన పొందారన్నారు. ఇంతపెద్ద సంఖ్యలో డెమోలో పాల్గొన్న ఓటర్లు న్న జిల్లాగా కూడా విశాఖ రికార్డు సృష్టిం చిందన్నారు. పరిస్థితి చూస్తుంటే గతంలో నమోదైన పోలింగ్ శాతాన్ని అధిగమించి నూరుశాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏలూరులో ఉన్న తన ఓటును విశాఖకు మా ర్పించుకున్నానని, ఎన్నికల్లో విధిగా ఓటుహక్కు వినియోగించుకుంటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకునేలా పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. 42 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే 32వేల మంది పోలింగ్ సిబ్బం దితో పాటు బందోబస్తు నిర్వహించే మరో 10 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని కలెక్టర్ వెల్లడిం చారు. వారు తాము ఏ కేంద్రంలో పనిచేయాలో ఇచ్చిన నియామక పత్రాన్ని జతచేసి కౌంటింగ్‌కు గంట ముందు వరకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సారి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని పెంచారని కలెక్టర్ వెల్లడించారు. అరుకు, పాడేరు మిన హా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరి«ధిలో ఉద యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వర కు పోలింగ్‌కు అనుమతిస్తారన్నారు. అదే అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్‌కు అనుమతించనున్నారన్నారు. అంతే కాదు గతంలో మాదిరిగా పోలింగ్ అనంతరం అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను స్థానికంగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారని, మర్నాడు వాటిని ప్రత్యేక బందోబస్తుతో జిల్లా కేంద్రానికి తరలిస్తారన్నారు. 10,105 మంది బైండోవర్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలకులుగా 18 మందిని నియమించారన్నారు. 53 ప్లైయింగ్ స్క్వాడ్లు, 51 స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు, 46 మోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్‌లు, 36 వీడియో సర్వలెన్స్ టీమ్‌లు, 18 చొప్పున వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. 399 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించగా, వారందరికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. 805 లైసెన్సడ్ ఆయుధాల్లో 650 ఆయుధాలను ఇప్పటి వరకు డిపాజిట్ చేశారన్నారు. 2595 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేశామని చెప్పారు. ఇప్పటి వరకు 10,103 మందిని బైండోవర్ చేశామన్నారు. కాగా ఇప్పటి వరకు 32,254.25 లీటర్ల మద్యం, రూ.22,50,630 నగదు, 80 వాహనాలను సీజ్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు టటటటటటట13,651 పోస్టర్లు, 6644 హోర్డింగ్‌లు తొలగించామని, 931 విగ్రహాలకు ముసుగులు వేశామని, వివిధ పార్టీలకు చెందిన 13,511 జెండాలను, అలాగే 4314 వాల్ పెయింటింగ్‌లను కూడా తొలగించామన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు మీరను.. మీరేవారిని సహించను
విశాఖపట్నం :ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తాను గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా చేసినా.. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నా.. ఎప్పుడు ఎక్కడ ఏ హోదాలో చేసినా.. నిబంధనల మేరకే పని చేస్తానని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటానని.. ఉద్యోగులు, అధికారులు తప్పు చేస్తే సహించనని స్పష్టం చేశారు. ప్రజలు తమ కనీస అవసరాల కోసం అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్రయిస్తారు... వారికి ప్రభుత్వసేవలే ఆధారం... ఆ సందర్భాల్లో ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా,, నిర్లక్ష్యంగా ఉన్నా.. అవినీతి, అక్రమాలకు పాల్పడినా.. తాను ఏమాత్రం సహించనని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఉద్యోగులకు శాఖాపరంగా ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత సందర్భంలో అధికారులు, ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, అయినా అందరూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ వివరించారు. ఓట్ల తొలగింపుపై అపోహలొద్దు ఓట్ల తొలగింపుపై అపోహలు, అనుమానాలకు తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓట్లు తొలగింపు చాలా పెద్ద ప్రక్రియ అని, అది ఏ ఒక్కరి చేతుల్లోనో ఉండదని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఈమధ్య కాలంలో 2,38,289 మంది ప్రజలు కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించి 1,80,300 మందిని ఓటర్లుగా నమోదు చేశాం.. మరో 40వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల సుమారు 18వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు. ఓట్ల తొలగింపు విషయానికి వస్తే.. 77వేల ఓట్లను తొలగించాలని ఫిర్యాదులొచ్చాయి. వాటిని పరిశీలించి 7814 ఓట్లు మాత్రమే తొలగించామని చెప్పారు. ఈ లెక్కన చూస్తే ఓట్ల నమోదు 90శాతం ఉంటే.. తొలగింపు పదిశాతం లోపే ఉందని వివరించారు. ఐదు దశల్లో విచారించిన తర్వాతే ఓట్ల తొలగింపు చేపడతామని కలెక్టర్ చెప్పారు. తొలుత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో), ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీవో... ఆనక కలెక్టర్ పరిశీలించిన తర్వాత చివరగా ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన తర్వాత అక్కడ పరిశీలించి ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటారని వివరించారు. అంతే కానీ ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన ఓట్లు తొలగించేస్తారనుకోవడం అపోహ మాత్రమేనని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణలు అబద్ధం..వైఎస్‌తోనూ అనుబంధం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబులతో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందన్న వాదనలు, ఆరోపణల్లో వాస్తవం లేదని కలెక్టర్ తేల్చిచెప్పారు. తాను బా«ధ్యత కలిగిన ఓ ప్రభుత్వ అధికారిగా సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానని, అంతే గానీ ఎవరితోనూ ప్రత్యేక అనుబంధం, వర్గ నేపథ్యం లేదని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టును పాలకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. ఆ మేరకు తానూ కష్టపడ్డానని గుర్తు చేశారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ తనకు ప్రత్యేక అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లలో మూడేళ్లకు పైగా తాను హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని పాతబస్తీ కమిషనర్‌గా చేశానని చెప్పారు. ఆ సమయంలో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టిన తనపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని.. అప్పుడు గో ఏహెడ్ భాస్కర్.. అని వైఎస్ నైతికస్థైర్యాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. 2009లో ఆయన మలి విడత ముఖ్యమంత్రి అయినప్పుడు ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను తానే దగ్గరుండి చూశానని చెప్పారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వ ఆదేశాలను, మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించడం ఒక్కటే తెలుసని కలెక్టర్ కాటంనేని వ్యాఖ్యానించారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే జైలుకే ఎన్విఎస్పి.ఇన్ వెబ్సైట్ ద్వారా చాలామంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు.. బతికున్న వారి ఓట్లను కూడా తొలగించాలని దరఖాస్తు చేస్తున్నారు. ఇలా తప్పుడు దరఖాస్తులు చేయిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఎవరెవరు ఎక్కడి నుంచి.. ఏ సైబర్ కేఫ్ నుంచి... ఏ ఇంటర్నెట్ సెంటర్ నుంచి.. ఏ సిస్టమ్ నుంచి పంపించారో చెక్ చేసే పరిజ్ఞానం మన వద్ద ఉంది.. ఐపీ అడ్రస్‌ను కనుక్కొని నిందితులను పట్టుకుంటాం.. ఇలాంటి కేసుల్లో కనీసం ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశముంది. అందుకే తప్పుడు దరఖాస్తులు, ఫిర్యాదులు ఇచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.. అని కలెక్టర్ భాస్కర్ హెచ్చరించారు. -
కలెక్టర్ భాస్కర్‌కు జైలుశిక్ష, జరిమానా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది. ఏడాది కాలంగా ఎస్సీ కార్పొరేషన్లో ఆరుగురు ఉద్యోగుల జీతాల విషయంలో వివాదం నెలకొనడం, గత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆరుగురు ఉద్యోగులపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత ఉద్యోగులు న్యాయపోరాటం చేశారు. ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కోర్టు ధిక్కారం కింద జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎస్.వి.శేషగిరిరావు మరో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ వచ్చింది. ఆ మేరకు వారు వేతనాలు అందుకుంటున్నారు. అయితే వీరిని నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ చేశారని, అక్రమంగా పదోన్నతులు ఇచ్చారని నిర్ధారిస్తూ వారి వేతనాలు నిలిపివేశారు. దీనిపై తమ జీతాల విడుదలకు 2015లో హైకో ర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లకు జీతాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో శేషగిరిరావు తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సుప్రీంకోర్టు తమ ఆదేశాలపై స్టే ఇవ్వనందున, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని భావిస్తూ జిల్లా ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. అప్పీల్ నిమిత్తం తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు. జిల్లా కలెక్టర్‌కు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
మీ వల్లే అమ్మాయి జీవితం నాశనం
పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యిందని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ సాంఘిక సంక్షేమశాఖ సహాయ సాంఘిక సంక్షేమాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చింతలపూడి సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థిని ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. తక్షణమే సహాయ సాంఘిక సంక్షేమాధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వార్డెన్ల బయోమెట్రిక్ హాజరు పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీదేవికి ఛార్జిమెమో ఇవ్వాలని డీఆర్వోను సత్యనారాయణను ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, అధికారులు ఉద్యోగం చేస్తున్నారా లేక గాడిదలు కాస్తున్నారా అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆడపిల్లకు కోల్పోయిన జీవితాన్ని తెచ్చి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వసతిగృహాలకు లైసెన్స్‌లు ఉండాలి ఏలూరు (మెట్రో) : జిల్లాలో బాలల వసతిగృహాలకు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల సంరక్షణ సమితి పనితీరు 3 నెలలకు ఒకసారి సమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గోశాల అమలుకు చర్యలు జిల్లాలో ‘గోశాల పథకం’ సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజలు ఫోన్ల ద్వారా పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన కృష్ణకుమార్ ఫోన్లో మాట్లాడుతూ గోశాల పథకం గురించి తెలపాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గోశాల పథకం గురించి తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
వారం రోజుల్లో పట్టిసీమ నుంచి నీరు విడుదల
ఏలూరు (మెట్రో) : గోదావరిలో నీటి మట్టం పెరుగుతోందని, ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నందున వారం రోజుల్లో పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయాధికారుల సమావేశంలో ఖరీఫ్ పంటకు నారుమడులు, కౌలు రైతులకు రుణాలు, శివారు ప్రాంత భూములకు సాగునీరు వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గోదావరిలో ఇప్పటికే 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని మన అవసరాలకు పదిహేను వేల క్యూసెక్కుల నీరు సరిపోతుందని మిగిలిన 15వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులను ఆదుకుంటామని కలెక్టర్ చెప్పారు. కృష్ణా కాలువ నుంచి పట్టిసీమ నీరు రావడానికి ఆలశ్యమవుతున్న దృష్ట్యా తూర్పు లాకుల వద్ద గురువారం సాయంత్రంలోగా మోటార్ల ద్వారా దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల పరిధిలో వరి నర్సరీలు పెంచుకునేందుకు వీటిని మళ్లించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మూడు మండలాల పరిధిలో 440 హెక్టార్లలో వరి నర్సరీ పెంచాల్సిన అవసరం ఉన్నదని రేపు సాయంత్రానికల్లా తూర్పు లాకుల ప్రాంతాన్ని తనిఖీ చేస్తానని మోటార్లు అన్ని పని చేస్తూ ఉండాలన్నారు. 18.55శాతం పామాయిల్ దిగుబడి సొమ్ము ఇవ్వాల్సిందే జిల్లాలో పామాయిల్ రైతులకు 18.55శాతం ఆయిల్ దిగుబడి చొప్పున ఇకపై సొమ్ము చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రాధాన్యతా రంగాల ప్రగతితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక ఆయిల్‌పామ్ రైతులకు 16.4 శాతం దిగుబడి మాత్రమే వస్తుందంటూ సొమ్ము చెల్లిస్తుండటంతో పలువురు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణలోని సత్తుపల్లిలో 18.55 శాతం ఆయిల్ దిగుబడి వస్తుండటంతో అక్కడే ఆయిల్‌పామ్ గెలలు క్రషింగ్ చేయించడంతో నిరూపితమైందన్నారు. ఇకనుంచి ఆయిల్‌పామ్ రైతులకు 18.55 శాతం వంతున సొమ్ము చెల్లించాలని, దీన్ని అన్నిక ంపెనీలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో వాస్తవాలతో కూడిన నివేదికలు సమర్పించకపోతే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. పరిశ్రమలకు 24 గంటల్లో అనుమతులు పరిశ్రమలకు అవసరమైతే 24 గంటల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పా. స్థారునిక కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి భారీ పరిశ్రమలకు కూడా 48 గంటల్లో అనుమతులు ఇచ్చి రికార్డు సృష్టించాలని అంతే తప్ప చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి అనుమతులను జాప్యం చేయొద్దని కలెక్టర్ సూచించారు. ఆన్లైన్ విధానం అమల్లో ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఎప్పటికప్పుడు ఆన్లైన్ పరిశీలిస్తూ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. దీనివల్ల నూతన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు పశ్చిమ వైపు ఎదురుచూస్తారని ఆయన చెప్పారు. వట్లూరు బ్రిడ్జి ఆలస్యంపై ఏఈ సస్పెన్షన్ వట్టూరు బ్రిడ్జి దశాబ్దం దాటుతున్నా నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని కలెక్టర్ ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. దీనికి బాధ్యులని తక్షణం సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆర్అండ్బీ ఏఈ శేషుకుమార్‌ను బుధవారం సాయంత్రానికి సస్పెండ్ చేయాలని ఆశాఖ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు జేసీ షరీఫ్, డీఆర్వో సత్యనారాయణ, వ్యవసాయశాఖ జేడీ గౌసియాబేగం, ఆర్అండ్బీ ఎస్ఇ నిర్మల, పరిశ్రమల శాఖ జీఎం త్రిమూర్తులు, జిల్లాలోని ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్సంటేజీలు మానుకుంటే నాణ్యమైన రోడ్లు పర్సంటేజీలు మానుకుంటేనే నాణ్యమైన రోడ్లు దర్శనమిస్తాయని లేకపోతే ఎన్నాళ్లు అయినా ఆధ్వానస్థితి తప్పదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆర్అండ్బీ అధికారులతో రోడ్లు పరిస్థితిపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీలో అవినీతి రాజ్యమేలుతోందని ఏ రోడ్డు చూసినా నిర్మించిన ఆరు నెలలకే గతుకులమయం అవుతోందని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి ఆర్అండ్బీ సిబ్బంది, అధికారులు పర్సంటేజీలు వదులుకుంటే నాణ్యమైన రోడ్లను ప్రజలు చూడగలుగుతారని ఆయన చెప్పారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డుపై గర్భిణి ప్రయాణిస్తే రోడ్డుపైనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉందని కలెక్టర్ చెప్పారు. -
కేసీఆర్ ప్రకటనపై స్పందించిన ఏపీ కలెక్టర్
ఏలూరు: తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి ఆ రాష్ట్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన నాలుగైదు గ్రామాలను వెనక్కి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ ప్రకటన విలీన గ్రామాల్లో కలకలం రేపింది. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాల్లో ఈ విషయంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ విషయాన్ని సాక్షి విలేకరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా... ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. 'కేసీఆర్ ఏ సందర్భంలో ఏయే గ్రామాల గురించి ప్రకటన చేశారో మాకు తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన గ్రామాలు మాత్రం తిరిగి వెళ్లే ప్రసక్తి లేదు' అని తేల్చి చెప్పారు. వాస్తవానికి గ్రామాల విలీనం చేయాలంటే కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో చర్చ పెట్టాలని, ఆ మేరకు తొలుత జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాలని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు తాము అలాంటి ప్రతిపాదనలపై ఆలోచన చేయలేదని అన్నారు. ఇంకా తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలం నుంచి మరో నాలుగు గ్రామాలు మన జిల్లాకే రావాల్సి ఉందని... ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.