యూకే నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా | Six People From UK Tests Corona Positive In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

యూకే నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా

Published Sun, Dec 27 2020 9:59 AM | Last Updated on Sun, Dec 27 2020 10:18 AM

Six People From UK Tests Corona Positive In Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. అయితే అది ఇంకా కొత్త వైరస్‌ అని నిర్ధారణ కాలేదని చెప్పారు. వీరి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా గుంటూరులో ఇద్దరికీ కరోనా సోకిందని, వీరందరినీ కోవిడ్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త వైరస్‌ గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, దాని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా)

యూకే నుంచి గత నెల రోజుల్లో 1214 మంది ఏపీకి రాగా ఇందులో 1158 మంది అడ్రస్‌లను గుర్తించినట్లుగా కాటంనేని భాస్కర్‌ వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 1101 మంది క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. 56 మంది ప్రయాణీకుల అడ్రస్‌లు దొరకలేదని చెప్పారు. యూకే నుంచి వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. యూకే నుంచి ఏపీకి వచ్చినవారు కరోనా టెస్ట్‌ చేయించుకోవడంతో పాటు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు సైతం పాటించాలని కోరారు. (చదవండి: కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement