ఉద్యోగా.. పార్టీ ప్రతినిధా..? | B Balakrishna working in TB hospital | Sakshi
Sakshi News home page

ఉద్యోగా.. పార్టీ ప్రతినిధా..?

Published Sat, May 27 2017 12:12 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఉద్యోగా.. పార్టీ ప్రతినిధా..? - Sakshi

ఉద్యోగా.. పార్టీ ప్రతినిధా..?

విశాఖసిటీ: నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ఓ సర్కారు ఉద్యోగి పార్టీ ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. నగరంలోని టీబీ ఆస్పత్రిలో ఎంఎన్‌వోగా విధులు నిర్వర్తిస్తున్న బి. బాలకృష్ణ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ విశాఖ అర్బన్‌ జిల్లా కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. మహానాడు సందర్భంగా.. పలు చోట్ల ఆయన ఫొటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. పార్టీ పదవులు చేపడుతున్న బాలకృష్ణ సీసీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. బాలకృష్ణ వ్యవహార శైలిపై టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement