ఉమాభారతిని కలిసిన చంద్రబాబు
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఉమాభారతిని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా..కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం సాయమందించాలని కోరారు. నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శ రాష్ట్రంగా గుర్తించాలని కోరారు.