
22వేల టీకప్పులతో ‘బాహుబలి’
పలమనేరు(చిత్తూరు): బాహుబలి–2 చిత్రం విడుదల సందర్భంగా పలమనేరుకు చెందిన సమీర్ అనే యువకుడు తన మిత్రబృందంతో కలసి తన అభిమాన హీరో ప్రభాస్ ముఖచిత్రాన్ని టీ కప్పులతో తయారు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. పట్టణంలోని వాణి విద్యాశ్రమం పాఠశాల పక్కన ఖాళీ స్థలంలో గురువారం సాయంత్రం ఈ ముఖచిత్రాన్ని స్థానిక ప్రభాస్ ప్యాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆవిష్కరించారు.
దీనికోసం నాలుగు రోజులుగా 22వేల టీకప్పులను వినియోగించి, అందులో రెండువేల లీటర్ల పలు రంగునీళ్లను నింపి రూపొందించినట్టు సమీర్ తెలిపాడు. ఇందుకోసం రూ.35వేలను ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్లు సీవీకుమార్, రాకేష్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మండీ సుధా సమీర్ సృజనాత్మకతను అభినందించారు. ఇప్పటికే వైస్ ముఖచిత్రాన్ని సమీర్ వినూత్నంగా రూపొందించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శ్యామ్‌సుందర్‌రాజ్, నీళ్లకుంట మణి, మూర్తి, సోము, ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు.