లాకర్లలో రూ.కోట్ల విలువైన పత్రాలు,
బంగారు ఆభరణాలు, నగదు, పిస్టోలు?
‘ఎర్ర’డాన్‌ను చిత్తూరుకు తీసుకొచ్చే యత్నం
కోల్‌కతా హైకోర్టులో పిటిషన్
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్, మాజీ ఎయిర్ హో స్టెస్, మోడల్ కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. సంగీత, ఆమె భర్త లక్ష్మణ్‌కు చెందిన బ్యాంకు లాకర్లను గురువారం తెరిచారు. అందులో పలు కీలక పత్రాలు లభించాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. రెండున్నర కేజీల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఇప్పటికే రెండుసార్లు చిత్తూరు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న సంగీతను ఇక్కడికి తీసుకొచ్చేందుకు కోల్‌కతా హైకోర్టులో మధ్యంతర పిటిషన్ సైతం పోలీసులు దాఖలు చేశారు.
లాకర్ బద్దలు..
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన స్మగ్లర్, రెండుసార్లు పీడీ యాక్టుపై జైలుకు వెళ్లిన నిందితుడు లక్ష్మణ్ రెండో భార్య సంగీతను గత నెల చిత్తూరు పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేసి తప్పనిసరి పరిస్థితితుల్లో అక్కడి కోర్టులో హాజరుపరచిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈమెపై యాదమరి, గుడిపాల, నగరి పోలీసు స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి. వీటిలో చిత్తూరు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న సంగీతను ఈసారి చిత్తూరుకు రప్పించేందుకు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌రావుతో పాటు ప్రత్యేక బృందాన్ని రెండు రోజుల క్రితం కోల్‌కతాకు పంపించారు. గత నెల సంగీతను అరెస్టుచేసిన సమయంలో ఆమె, లక్ష్మణ్‌కు చెందిన పలు బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీన్ని అక్కడి పోలీసుల సమక్షంలో తెరిచారు. ఇందు లో రూ.కోట్ల విలువచేసే ఆస్తుల పత్రా లు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటితోపాటు లాకర్లో పిస్టో లు కూడా లభించినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో సంగీతను చిత్తూరుకు తీసుకురానున్నట్టు సమాచారం.