
సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం) : హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి విస్తుపోయారు.. విద్యార్థుల దురవస్థను చూసి చలించిపోయారు.. మాజీ మంత్రి, టెక్క లి ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జమానాలోని బీసీ బాలుర వసతి గృహం లోని దయనీయ స్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. శుక్రవారం రాత్రి నిమ్మాడ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ధ ర్మాన కృష్ణదాస్ ఓ విద్యార్థి తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్న విషయాన్ని గ మనించి, వైద్య సిబ్బందిని వసతి గృ హా నికి రప్పించి విద్యార్థికి వైద్య సాయం అం దే విధంగా చర్యలు చేపట్టారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్‌తోపాటు సిబ్బంది ఎవరూ హాస్టల్‌లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
అక్కడ అందుబాటులో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాణి నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు. హాస్టల్లో 98 విద్యార్ధులుండగా శుక్రవారం వారిలో 78 మంది ఉ న్నారు. వారిలో ధనుంజయరావు అనే వి ద్యార్ధికి తీవ్ర అస్వస్థత నెలకొనడంతో వై ద్యసేవలందించారు. మెనూ అమలు, కా స్మొటిక్స్ సొమ్ముల గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు స్వంత గ్రామంలో హాస్టల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉండడాన్ని ధర్మాన ఆక్షేపిం చారు. హాస్టల్లో మురుగు వ్యవస్థ , మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంపై మంత్రి విస్తుపోయారు.
వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరిస్తాం
నరసన్నపేట: వసతి గృహాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆర్‌అండ్‌బి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వార్డెన్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అద్దె భవనంలో వసతిగృహం నిర్వహిస్తున్నామని, శాశ్వత భవనం కావాలని వసతిగృహ అధికారులు మంత్రికి తెలిపారు. తాగేందుకు మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
వెంటనే స్పందించిన మంత్రి వారం రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారం కావాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో భోజన సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేట్రిన్లు చూడాలని, చేతివాటం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment