బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్
ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్
బ్రాడీపేట: కాపులను బీసీల్లో చేర్చాలనే అంశాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం స్థానిక బ్రాడీపేటలోని హోటల్‌లో సమావేశం నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చాలనే యోచనను నిరశిస్తూ ప్రత్యక్ష ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. ఈసందర్భంగా టీడీపీ జనచైతన్య యాత్రలను గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో బీసీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీ జాబితాలోచేర్చాలనే ప్రభుత్వ కుయుక్తులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బీసీల ప్రజలు కుల సంఘాలు టీడీపీ జన చైతన్య యాత్రలను అడ్డుకోవాలని బీసీ సంఘర్షన సమితి జిల్లా అధ్యక్షుడు ఓర్సు లూర్ధురాజ్ పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కోవూరి సునిల్ కుమార్ మాట్లాడుతూ కాపులకు, బీసీలకు మధ్య అగాధాన్ని పెంచి రాజకీయ స్వార్ధానికి చంద్రబాబు కాపులను పావులుగా వాడుకుంటున్నారన్నారు. బీసీ ల జాబితాలో కాపులను చేర్చడం సహేతుకం కాదన్నారు. అనంతరండ్డెర సంఘం నాయకులు ఓర్సు ప్రేమ్‌రాజ్, రజక హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాచకొండ లక్ష్మయ్య, బీసీ ప్రొఫెషనల్ అధ్యక్షులు గుర్రం చినవీరయ్య తదితరులు ప్రసంగించారు.
కాపులను బీసీల్లో చేర్చితే ప్రత్యక్ష ఆందోళన తప్పదు
Published Thu, Dec 3 2015 12:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement