అద్దెకు వచ్చే బ్రహ్మచారులతో జాగ్రత్తగా ఉండాలని సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి తెలిపారు.
ఇళ్లు అద్దెకు తీసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను విజయనగరం జిల్లా సాలూరులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 6 తులాల బంగారం, సెల్ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం జిల్లాలో విద్యార్థులమని, ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నామంటూ అద్దెకు వచ్చే బ్రహ్మచారులతో జాగ్రత్తగా ఉండాలని సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి తెలిపారు. గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని ఆయన ఇళ్ల యజమానులకు సూచించారు.