‘పచ్చ’ని పల్లెలకు పురస్కారం | Best village Selection of panchayats | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ని పల్లెలకు పురస్కారం

Published Sun, Apr 24 2016 2:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Best village Selection of panchayats

 ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికలోనూ టీడీపీ తన ముద్ర వేసుకుంటోంది. తమ అనుయూయులకే పెద్ద పీట వేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ మద్దతు పంచాయతీలను పరిగణనలోకి తీసుకోనివ్వడం లేదు. రాజకీయూలకు అతీతంగా జరగాల్సిన ప్రక్రియలో అన్యాయూనికి ఒడిగడుతోంది. పంచాయతీరాజ్ డే సందర్భంగా ఇవ్వనున్న ఉత్తమ పంచాయతీ పురస్కారాలను టీడీపీ మద్దతుదారులే ఎగరేసుకుపోనున్నారు. ఇప్పటికే వీరి ఎంపిక పూర్తరుుందని తెలిసింది. అన్ని విధాలుగా పంచాయతీలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచులు ఈ ఎంపిక తీరును చూసి ఏవగించుకుంటున్నారు. అధికార టీడీపీ ప్రదర్శిస్తున్న పైరవీ పెత్తనానికి నొచ్చుకుంటున్నారు. పారదర్శకతకు నిలువునా పాతరేసి ఇలా చేయడం తగదని మండి పడుతున్నారు.
 
 కవిటి: మండల..జిల్లా..రాష్ట్ర స్థారుులో ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి ప్రోత్సహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ ఎంపికకు మాగదర్శకాలను విడుదల చేసింది. వీటికి అనుగుణంగా పంచాయతీల ను ఎంపిక చేయూలని పేర్కొంది. జిల్లాలో 1099 గ్రామపంచాయతీలున్నారుు. 38 మం డలాలున్నారుు. మండలం నుంచి మూడు పంచాయతీలను ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలకు ఎంపిక చేస్తారు. మండల స్థారుు లో ప్రథమ పంచాయతీకి రూ.1లక్ష, ద్వితీ య స్థానానికి రూ.75వేలు, మూడో స్థానాని కి రూ.50వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. తర్వాత మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలలో  మూడింటిని జిల్లా ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పంచాయ తీలకు వరుసగా రూ.3లక్షలు,రూ.2లక్షలు,రూ.1లక్ష చొప్పున నగదు అందిస్తారు.
 
 ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే..
  మండల,జిల్లా,రాష్ట్రస్థాయిలో అధికారుల కమిటీల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
  2014-15లో ఆడిట్ అభ్యంతరాలు లేకుండా నిధులను సక్రమంగా వినియోగించాలి. ఆడిట్ అభ్యంతరాలున్న పంచాయితీలను పరిశీలించరు.
 
  2015-16లో శతశాతం పన్ను వసూలు చేసిన పంచాయితీలకు 100 మార్కులు వేస్తా రు. 90 శాతం వసూళ్లకు తొంభై మార్కులు వేస్తారు. ఆన్‌లైన్‌లో వసూళ్ల వివరాలు నమోదైతేనే మార్కులు వేస్తారు.  ఈ విధానంలో గ్రామపంచాయితీ ప్రణాళిక ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో నమోదు చేస్తే 25 మార్కులుంటారుు. పాక్షికంగా చేస్తే 15 మార్కులుంటా.   డిజిటల్ పంచాయితీ విభాగంలో ఇంటిపన్ను, జనన,మరణ రిజిస్ట్రేషన్ బ్యాక్‌లాగ్ డాటా ను పూర్తిగా ఆన్‌లైన్‌చేస్తే 25 మార్కులు వేస్తారు. పాక్షికంగా నమోదు చేస్తే 10 మార్కులు.  డిజిటల్ పంచాయితీ వెబ్‌సైట్‌లో కనీసం ఒక ఆన్‌లైన్ సర్టిఫికేట్‌ను విజయవంతంగా జనరేట్ చేస్తే25 మార్కులు.
 
   ఈనెల 10 ..11 తేదీలలో మండలస్థాయి కమిటీ  ఉత్తమ గ్రామపంచాయితీని ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో మొదటిస్థానంలో నిలి చిన పంచాయతీని 12న జిల్లాస్థాయికి నామినేట్ చేస్తుంది. మండలా ల  ప్రతిపాదనలను పరిశీలించి 15న జిల్లా స్థారుులో మొదటిమూడు స్థానాలకు ఎంపిక చేస్తారు. ఇదే విధంగా రాష్ట్ర స్థారుుకి కూడా.
 
 అనుయూయులకు పట్టం
 ఉత్తమ పంచాయతీల ఎంపికలో చాలాచోట్ల నిబంధనలకు పాతరేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.  మండలస్థాయి ఎంపికలోనూ, జిల్లాస్థాయికి పంపిన ప్రతిపాదనల విషయంలో అధికార పార్టీ అనుయూయులకు అగ్రాసనమేసినట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతిపరులైన సర్పంచుల సారథ్యంలోని పంచాయతీలకే నగదు పురస్కారం అందించనున్నట్లు సమాచారం. నిబంధనలను కచ్చితంగా పాటిస్తే కొన్ని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల సారథ్యంలోని పంచాయతీలు ఎంపిక కావాలి. కానీ ఇలా జరగలేదని భోగట్టా. అన్ని మండల స్థాల్లోనూ పైరవీలు నడిచాయని చెబుతున్నారు. ఈ ఎంపికలపై జిల్లా కలెక్టర్ ఉన్నతస్థాయిలో లోతుగా పరిశీలించాలని సర్పంచులు కోరుతున్నారు. అర్హులకు అవార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని వీరంతా అభ్యర్థిస్తున్నారు.
 
  వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లను కిందికి తొక్కేసే చర్య
 జిల్లాలోని మెజారిటీ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌లే అధికంగా ఉన్నారు. అనధికారిక సమాచారం ప్రకారం మార్గదర్శకాల అమలులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లున్న స్థానాలకే మెజారీటీ మండలాల్లో అవార్డులు వచ్చే పరిస్థితి ఉంది. ఇది గుర్తించిన అధికారపార్టీ మంత్రులు వాటిని కప్పిపుచ్చి తమ అనుచరగణానికి వీటిని కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. ఇది అప్రజాస్వామికం. సమగ్రవిచారణ జరపాలి.
 -రొక్కం సూర్యప్రకాశరావు, జిల్లా  సర్పంచ్‌ల సంఘం
 అధ్యక్షుడు
 
 పారదర్శకంగా ఎంపికలు జరగాలి
 ఉత్తమ పంచాయితీల ఎంపి క ప్రక్రియ పారద ర్శకంగా జరగాలి. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల అధికారులు నిబంధనల కు చెల్లుచీటి ఇస్తున్నారు. మండలస్థాయిలో విస్తృత ప్రయోజనాలకు ఇది అవరోధం.
 - కడియాల పద్మ, శిలగాం సర్పంచ్,కవిటిమండలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement