Best village
-
ఉత్తర తెలంగాణలో ఆదర్శగ్రామంగా మల్లంపల్లి
ములుగు: కృషి, పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పాలకవర్గం అధికారులు కష్టపడితే మారుమూల గ్రామం సైతం ఆదర్శంగా మారుతుంది. అనడానికి జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామం ఉదహరణగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది మల్లంపల్లి రాష్ట్ర స్థాయిలో పోటీపడి ఎస్ఎస్ఐపీ (సెల్ఫ్ సఫీసియంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ) విభాగంలో అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న 27 జీపీల సర్పంచులు, కార్యదర్శులతో కలిసి మల్లంపల్లి పాలకవర్గం, జిల్లా యంత్రాంగం నేడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రాష్ట్ర స్థాయి అవార్డును మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి, కార్యదర్శి పి.రాజు అందుకోనున్నారు. రూ.2.66కోట్లతో మౌలిక వసతులు జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ 365, 163 జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ సాధారణ జీపీగానే అందరికీ తెలుసు. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.66 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి డ్యాక్యు మెంటరీని అధికారులు సమర్పించారు. మండల, జిల్లా స్థాయిలో అవార్డును గెలుచుకున్న మల్లంపల్లి రాష్ట్రస్థాయి అవార్డు కోసం చేసిన డాక్యుమెంటరీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఏర్పాటు, గ్రంథాలయం, కమ్యూనిటీ సెంటర్, విలేజ్ పార్కు, ప్లే గ్రౌండ్, ఈ పంచాయతీ, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు వంటి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ కింద ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిటీ మల్లంపల్లిని రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల 27 గ్రామ పంచాయతీలు 9 అంశాలలో 3 గ్రామ పంచాయతీల చొప్పున 27 పంచాయతీలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. మల్లంపల్లి వివరాలు ఇళ్లు 1,250 వార్డులు 12 జనాభా 4,670 సహకరించిన వారికి కృతజ్ఞతలు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకటయ్య సహకారంతో ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సక్రమంగా పూర్తిచేశాం. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్, క్రిమిటోరియం, తడి, పొడి చెత్త వేరుచేయడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. - చందా కుమారస్వామి, సర్పంచ్ మల్లంపల్లి బాధ్యత పెరిగింది మల్లంపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీ అవార్డుకు ఎంపిక కావడంతో గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రతీ పనిని బాధ్యతతో పూర్తి చేశాం. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుని పనులు పూర్తి చేశాం. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు అభివృద్ధి పనుల్లో సహకరించారు. ఇక ముందు మల్లంపల్లిని గంగదేవిపల్లిలా ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం. ఇందుకోసం పాలకవర్గం గ్రామ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. పి.రాజు, పంచాయతీ కార్యదర్శి మల్లంపల్లి -
జాతీయ స్థాయికి రాష్ట్రం నుంచి ఏకైక పంచాయతీ!
సాక్షి, ఆదిలాబాద్ : ‘నిన్నటి వరకు నేను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గురించి చెప్పేవాడిని. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామం పేరు తలుస్తా.. గ్రామాలు ఎలా ఉండాలో చూసి రమ్మని అధికారులు, సర్పంచులకు చెబుతా..’’ఇది స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖరా(కే) గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షితో అన్నమాటలివి. నిజంగా సీఎం మాటలకు అనుగుణంగా అక్కడ అభివృద్ధి జరిగిందా? ఆ గ్రామం కేసీఆర్ దృష్టిని ఎలా ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఎందుకు ఎంపికైంది? ముఖరా(కే) గ్రామం అభివృద్ధిపై ప్రత్యేక కథనం. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామంలో 300 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 700 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత కనిపిస్తాయి. తడిచెత్త, పొడిచెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తయితే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు. వీటితోపాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తిస్తూ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక పంచాయతీ ముఖరా(కే) కావడం గమనార్హం. ప్రభుత్వ పథకాలను వంద శాతం ఉపయోగించుకుంటూ ఈ గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. నూతన పంచాయతీగా ఏర్పడినప్పటికీ అభివృద్ధిలో ముందంజలో ఉంది. నవంబర్ 19న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖరా(కే) సర్పంచ్ గాడ్గే మీనాక్షితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, సామూహిక మరుగుదొడ్లు వంటి పథకాలను వందశాతం అమలు చేయడంపై ఆయన సర్పంచ్‌ను అభినందించారు. గ్రామంలో ప్రకృతి వనం చూడముచ్చటగా ఉంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్పంచ్, ఆమె భర్త, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమలు చేస్తున్నారు. నర్సరీ, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, వైకుంఠధామం నిర్మించారు. మియావాకీ విధానంలో దట్టమైన అడవులు పెంచాలని ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ గ్రామంలో పంచాయతీ స్థలంలో 19 వేల మొక్కలు నాటి పెంచుతున్నారు. ఆనందంగా ఉంది బహిరంగ మల, మూత్ర విసర్జనతో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది. మహిళ సర్పంచ్‌గా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించా. ఫలితంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం సాధ్యమైంది. ముఖరా పంచాయతీకి జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం మహిళా సర్పంచ్‌గా చాలా గర్వంగా.. ఆనందంగా ఉంది. గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించి మా దగ్గర రూ.కోటికి పైగా నిధులు ఉన్నాయి. ఈ నిధులపై వచ్చే వడ్డీతో ప్రభుత్వ పథకాల అమలుకు కొంత ఉపయోగించుకొని బిల్లులు వచ్చిన తర్వాత మళ్లీ వీడీసీకి తిరిగి ఇస్తున్నాం. – గాడ్గే మీనాక్షి, ముఖరా(కే) సర్పంచ్ -
‘పచ్చ’ని పల్లెలకు పురస్కారం
ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికలోనూ టీడీపీ తన ముద్ర వేసుకుంటోంది. తమ అనుయూయులకే పెద్ద పీట వేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ మద్దతు పంచాయతీలను పరిగణనలోకి తీసుకోనివ్వడం లేదు. రాజకీయూలకు అతీతంగా జరగాల్సిన ప్రక్రియలో అన్యాయూనికి ఒడిగడుతోంది. పంచాయతీరాజ్ డే సందర్భంగా ఇవ్వనున్న ఉత్తమ పంచాయతీ పురస్కారాలను టీడీపీ మద్దతుదారులే ఎగరేసుకుపోనున్నారు. ఇప్పటికే వీరి ఎంపిక పూర్తరుుందని తెలిసింది. అన్ని విధాలుగా పంచాయతీలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచులు ఈ ఎంపిక తీరును చూసి ఏవగించుకుంటున్నారు. అధికార టీడీపీ ప్రదర్శిస్తున్న పైరవీ పెత్తనానికి నొచ్చుకుంటున్నారు. పారదర్శకతకు నిలువునా పాతరేసి ఇలా చేయడం తగదని మండి పడుతున్నారు. కవిటి: మండల..జిల్లా..రాష్ట్ర స్థారుులో ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి ప్రోత్సహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ ఎంపికకు మాగదర్శకాలను విడుదల చేసింది. వీటికి అనుగుణంగా పంచాయతీల ను ఎంపిక చేయూలని పేర్కొంది. జిల్లాలో 1099 గ్రామపంచాయతీలున్నారుు. 38 మం డలాలున్నారుు. మండలం నుంచి మూడు పంచాయతీలను ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలకు ఎంపిక చేస్తారు. మండల స్థారుు లో ప్రథమ పంచాయతీకి రూ.1లక్ష, ద్వితీ య స్థానానికి రూ.75వేలు, మూడో స్థానాని కి రూ.50వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. తర్వాత మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలలో మూడింటిని జిల్లా ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పంచాయ తీలకు వరుసగా రూ.3లక్షలు,రూ.2లక్షలు,రూ.1లక్ష చొప్పున నగదు అందిస్తారు. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే.. మండల,జిల్లా,రాష్ట్రస్థాయిలో అధికారుల కమిటీల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2014-15లో ఆడిట్ అభ్యంతరాలు లేకుండా నిధులను సక్రమంగా వినియోగించాలి. ఆడిట్ అభ్యంతరాలున్న పంచాయితీలను పరిశీలించరు. 2015-16లో శతశాతం పన్ను వసూలు చేసిన పంచాయితీలకు 100 మార్కులు వేస్తా రు. 90 శాతం వసూళ్లకు తొంభై మార్కులు వేస్తారు. ఆన్లైన్లో వసూళ్ల వివరాలు నమోదైతేనే మార్కులు వేస్తారు. ఈ విధానంలో గ్రామపంచాయితీ ప్రణాళిక ఆన్లైన్లో పూర్తిస్థాయిలో నమోదు చేస్తే 25 మార్కులుంటారుు. పాక్షికంగా చేస్తే 15 మార్కులుంటా. డిజిటల్ పంచాయితీ విభాగంలో ఇంటిపన్ను, జనన,మరణ రిజిస్ట్రేషన్ బ్యాక్లాగ్ డాటా ను పూర్తిగా ఆన్లైన్చేస్తే 25 మార్కులు వేస్తారు. పాక్షికంగా నమోదు చేస్తే 10 మార్కులు. డిజిటల్ పంచాయితీ వెబ్సైట్లో కనీసం ఒక ఆన్లైన్ సర్టిఫికేట్‌ను విజయవంతంగా జనరేట్ చేస్తే25 మార్కులు. ఈనెల 10 ..11 తేదీలలో మండలస్థాయి కమిటీ ఉత్తమ గ్రామపంచాయితీని ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో మొదటిస్థానంలో నిలి చిన పంచాయతీని 12న జిల్లాస్థాయికి నామినేట్ చేస్తుంది. మండలా ల ప్రతిపాదనలను పరిశీలించి 15న జిల్లా స్థారుులో మొదటిమూడు స్థానాలకు ఎంపిక చేస్తారు. ఇదే విధంగా రాష్ట్ర స్థారుుకి కూడా. అనుయూయులకు పట్టం ఉత్తమ పంచాయతీల ఎంపికలో చాలాచోట్ల నిబంధనలకు పాతరేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. మండలస్థాయి ఎంపికలోనూ, జిల్లాస్థాయికి పంపిన ప్రతిపాదనల విషయంలో అధికార పార్టీ అనుయూయులకు అగ్రాసనమేసినట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతిపరులైన సర్పంచుల సారథ్యంలోని పంచాయతీలకే నగదు పురస్కారం అందించనున్నట్లు సమాచారం. నిబంధనలను కచ్చితంగా పాటిస్తే కొన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుల సారథ్యంలోని పంచాయతీలు ఎంపిక కావాలి. కానీ ఇలా జరగలేదని భోగట్టా. అన్ని మండల స్థాల్లోనూ పైరవీలు నడిచాయని చెబుతున్నారు. ఈ ఎంపికలపై జిల్లా కలెక్టర్ ఉన్నతస్థాయిలో లోతుగా పరిశీలించాలని సర్పంచులు కోరుతున్నారు. అర్హులకు అవార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని వీరంతా అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ సర్పంచ్‌లను కిందికి తొక్కేసే చర్య జిల్లాలోని మెజారిటీ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్‌లే అధికంగా ఉన్నారు. అనధికారిక సమాచారం ప్రకారం మార్గదర్శకాల అమలులో వైఎస్సార్సీపీ సర్పంచ్‌లున్న స్థానాలకే మెజారీటీ మండలాల్లో అవార్డులు వచ్చే పరిస్థితి ఉంది. ఇది గుర్తించిన అధికారపార్టీ మంత్రులు వాటిని కప్పిపుచ్చి తమ అనుచరగణానికి వీటిని కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. ఇది అప్రజాస్వామికం. సమగ్రవిచారణ జరపాలి. -రొక్కం సూర్యప్రకాశరావు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పారదర్శకంగా ఎంపికలు జరగాలి ఉత్తమ పంచాయితీల ఎంపి క ప్రక్రియ పారద ర్శకంగా జరగాలి. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల అధికారులు నిబంధనల కు చెల్లుచీటి ఇస్తున్నారు. మండలస్థాయిలో విస్తృత ప్రయోజనాలకు ఇది అవరోధం. - కడియాల పద్మ, శిలగాం సర్పంచ్,కవిటిమండలం.