బయోమెట్రిక్ తప్పనిసరి | biometric Mandatory | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్ తప్పనిసరి

Published Thu, Apr 14 2016 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

బయోమెట్రిక్ తప్పనిసరి

బయోమెట్రిక్ తప్పనిసరి

 డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ

అనంతపురం మెడికల్ :  జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. ప్రతి క్లస్టర్ ఆఫీసర్ పీహెచ్‌సీలను తనిఖీ చేసి హాజరును పరిశీలించాలన్నారు. తన చాంబర్‌లో బుధవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో రోగులకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు.  ఫార్మసిస్టులు తా ము ఇచ్చిన మందుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయాలన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  వడదెబ్బ, మృతుల వివరాలను ప్రతి రోజూ పంపాలన్నారు. వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వడదెబ్బ మృతులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   సమావేశంలో ఎన్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, డీసీటీఓ డాక్టర్ సుధీర్‌బాబు తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement