
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి సూచించారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఈ అంశంపై గవర్నర్‌ను కలవాలని సూచించింది.
ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఇటీవల గవర్నర్‌ను కలసి తాను ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అనుమతించాలని కోరారు. దీన్ని పరిశీలించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హైకోర్టు తీర్పు మేరకు తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అదే విషయాన్ని గవర్నర్ కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా లేఖ ద్వారా నిమ్మగడ్డకు బుధవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment