బలమైనశక్తిగా బీజేపీ | BJP dominant force | Sakshi
Sakshi News home page

బలమైనశక్తిగా బీజేపీ

Published Sun, Mar 13 2016 11:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బలమైనశక్తిగా బీజేపీ - Sakshi

బలమైనశక్తిగా బీజేపీ

పార్టీ సమీక్ష సమావేశంలో హరిబాబు
 
ఎంవీపీ కాలనీ,(విశాఖపట్నం): ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఇటీవల రాజమండ్రిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ జరిగిన తీరుపై ఆదివారం పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ నాయకులు పాల్గొని, వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ మోదీ ప్రజారంజక పాలనకు ఆదరణ ఉందని చెప్పడానికి రాజమండ్రి బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని నిదర్శనమన్నారు.

అన్ని రాష్ట్రాలలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ అమిత్‌షా సభకు ప్రతి మండలం నుంచి 50 నుంచి 100 మంది వంతున ఉత్తరాంధ్ర నుంచి సుమారు 10 వేల మంది పాల్గొన్నారని అన్నారు. నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా జరిగిన బహిరంగ సభ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం సంతరించుకుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ మంత్రి పెద్దింటి రామ్మోహనరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మళ్ల వెంకటరావు, ఎమ్.నాగేంద్ర, కాశీవిశ్వనాధరాజు, చెరువు రామకోటయ్య వివిధ జిల్లాలు, నియోజకవర్గంల ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement