చంద్రబాబుని నిండా ముంచిన లోకేష్‌.. | BJP Leader Annam Satish Prabhakar Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబుని నిండా ముంచిన లోకేష్‌..

Published Fri, Jul 19 2019 3:50 PM | Last Updated on Fri, Jul 19 2019 8:05 PM

BJP Leader Annam Satish Prabhakar Fires On Nara Lokesh - Sakshi

సాక్షి, గుంటూరు : ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపమని రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని తెలిపారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుడు లోకేషే నిండా ముంచారని అభిప్రాయపడ్డారు.

లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని చెప్పారు. ఆయన కారణంగా చాలామంది నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, లోకేష్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని సతీష్‌ వెల్లడించారు. టీడీపీ అభివృద్ధి కోసం వాల్ పోస్టర్లు కూడా అంటించానని.. సొంత నిధులు ఖర్చుపెట్టి పార్టీని నడిపించానని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌లా తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదని విమర్శించారు. లోకేష్ కారణంగా త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్సీ  పదవీ కాలం ఉన్నప్పటికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement