నరేంద్ర మృతదేహం వద్ద బంధువుల రోదన (ఫైల్)
నెల్లూరు: వైఎస్సార్సీపీ నేత అల్లం నరేంద్ర హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో బీజేపీ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణానంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
నెల్లూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది అల్లం నరేంద్ర(37) డిసెంబర్ 30వ తేదీ రాత్రి దారుణహత్యకు గురయ్యారు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. వెనుకవైపు నుంచి విచక్షణారహితంగా కత్తులతో 26 పోట్లు పొడిచారు. స్థానికులు వెంటనే ఆయనను ఓ ఆస్పత్రికి తర లించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులోనే బీజేపీ నాయకుడు సహా.. నలుగురిని పోలీసలు ఇప్పుడు అరెస్టు చేశారు.