
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. జీవో రద్దు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల విశాఖపట్నంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విష్ణుకుమార్ ఆరోపించారు. ఈ విధానం వల్ల అక్రమార్కులు లాభపడ్డారు కానీ రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని వారికి ఇంటిని నిర్మించి ఇవ్వడానికి కొత్త విధానం తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment