కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతో తెలివిగా ప్రయోగించానని భావిస్తున్న రాయల తెలంగాణ అస్త్రం కాస్తా బూమెరాంగ్ అవుతోంది. అన్ని వర్గాల వాళ్లూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ రాజకీయ క్రీడలను చూసి మండిపడుతోంది. కేవలం ఎంఐఎం కోసమే రాయల తెలంగాణ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తీసుకొస్తోందని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఇలాగైతే తాము పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదుట వైద్య జేఏసీ ధర్నా చేసింది. రాయల తెలంగాణ అంశాన్ని వైద్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
కాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకే సీమాంధ్ర నేతలు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రమన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కాదని, రాయల తెలంగాణ సిఫార్సును జీవోఎం చేయడం నిబంధనలను వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణకు ముడిపెట్టడమంటే జోన్ 4ను విభజించడమేనని, అప్పుడు 371 (డి) ఆర్టికల్‌ను సవరించాల్సి వస్తుందని, అలా సవరించకపోతే విభజన ప్రక్రియ కోర్టులో నిలవదని జీవన్ రెడ్డి చెప్పారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వం: బీజేపీ
Published Tue, Dec 3 2013 12:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement