హైదరాబాద్ : యువతను ప్రోత్సహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నవభారత యువ భేరీ సభకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నాల్కల ధోరణి విధానం నడుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి రెండు నాల్కల ధోరణి ఉంటే..కాంగ్రెస్‌కు ఎన్ని నాల్కలు ఉన్నాయో తెలియడం లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ర్ట కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్ ఈ రోజు మాట్లాడిన మాట.. రేపు మాట్లాడని ఆయన విమర్శించారు. ఆయన పచ్చి అబద్దాల కోరని కిషన్‌రెడ్డి అన్నారు.
గతంలో అనేక ఉద్యమాలు జరిగినా తెలంగాణ ఇవ్వలేదని, వందల మంది ప్రాణం త్యాగం చేసినా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయలేదన్నారు. నరేంద్ర మోడీ నవభారత యువభేరీ సభకు భయపడిన కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసిందన్నారు. దేశ రాజకీయాల్లో మోడీ కేంద్ర బిందువయ్యారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు.. సీఎం సచివాలయానికి రావడం లేదన్నారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్రలో చోటు చేసుకున్న ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామానేమోనని అనుమానం కలుగుతుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు డెరైక్షన్‌లో అక్కడ..ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సోనియా ఆటలాడుతోందని, అన్ని రకాల సంక్షోభాలు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ పాలన నుంచి ప్రజలు విముక్తి కలిగించాలని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కిషన్‌రెడ్డిబీజేపీ పార్టీ రోజుకో మాట మాట్లాడదని, తమ పార్టీ ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఉన్నంతకాలం హైదరాబాద్‌లో ఎవరి ఆటలు సాగవన్నారు. బీజేపీ పిలుపు ద్వారా యువతి స్పందించి భారీగా నిధులిచ్చారన్నారు. ఉత్తరఖాండ్ బాధితులకు ఈ సభ ద్వారా నిధులను సమకూర్చుతున్నట్లు ఆయన తెలిపారు.