Nav Bharat Yuva bheri
-
కేశవ్ మెమోరియల్ స్కూల్లో ప్రసంగించిన మోడీ
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో ఉన్న కేశవ్ మెమోరియల్ స్కూల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అక్కడసర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నవభారత్ యువభేరీకి సభ సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన మోడీ.. తరువాత కేశవ్ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించారు. అంతకు ముందు ఎల్బి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గాంధీ, వల్లభాయి పటేల్ పుట్టిన ప్రాంతం నుంచి తాను వచ్చినట్లు తెలిపారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. సామాన్యుడికి మేలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. -
తెలుగులో ప్రసంగించిన నరేంద్ర మోడీ
హైదరాబాద్: నవభారత యువభేరీ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగించారు. ముందుగా 85 ఏళ్ల వృద్ధురాలికి, స్వాతంత్య సమర యోధులకు పాదాభివందనం చేసి ఆయన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించారు. గుజరాత్లో తెలుగువారి సంబంధాలు ప్రాచీనమైనవి ఆయన తెలిపారు. గుజరాత్లో తెలుగు మీడియం స్కూళ్లు ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచనం దినం అని.. అలాగే నా పుట్టిన రోజు కూడా అదే రోజని ఆయన తెలిపారు. -
యువతను ప్రోత్సహిస్తాం:కిషన్‌రెడ్డి
-
యువతను ప్రోత్సహిస్తాం:కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : యువతను ప్రోత్సహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నవభారత యువ భేరీ సభకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నాల్కల ధోరణి విధానం నడుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి రెండు నాల్కల ధోరణి ఉంటే..కాంగ్రెస్‌కు ఎన్ని నాల్కలు ఉన్నాయో తెలియడం లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ర్ట కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్ ఈ రోజు మాట్లాడిన మాట.. రేపు మాట్లాడని ఆయన విమర్శించారు. ఆయన పచ్చి అబద్దాల కోరని కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో అనేక ఉద్యమాలు జరిగినా తెలంగాణ ఇవ్వలేదని, వందల మంది ప్రాణం త్యాగం చేసినా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయలేదన్నారు. నరేంద్ర మోడీ నవభారత యువభేరీ సభకు భయపడిన కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసిందన్నారు. దేశ రాజకీయాల్లో మోడీ కేంద్ర బిందువయ్యారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు.. సీఎం సచివాలయానికి రావడం లేదన్నారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్రలో చోటు చేసుకున్న ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామానేమోనని అనుమానం కలుగుతుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు డెరైక్షన్‌లో అక్కడ..ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సోనియా ఆటలాడుతోందని, అన్ని రకాల సంక్షోభాలు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ పాలన నుంచి ప్రజలు విముక్తి కలిగించాలని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిషన్రెడ్డిబీజేపీ పార్టీ రోజుకో మాట మాట్లాడదని, తమ పార్టీ ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఉన్నంతకాలం హైదరాబాద్‌లో ఎవరి ఆటలు సాగవన్నారు. బీజేపీ పిలుపు ద్వారా యువతి స్పందించి భారీగా నిధులిచ్చారన్నారు. ఉత్తరఖాండ్ బాధితులకు ఈ సభ ద్వారా నిధులను సమకూర్చుతున్నట్లు ఆయన తెలిపారు. -
హైదరాబాద్ చేరుకున్న మోడి
-
హైదరాబాద్ చేరుకున్న నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాలు పలువురు ప్రముఖులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరంలోని పార్క్‌హయత్ హోటల్ చేరుకున్నారు. నగరంలోని ఎల్ బీ స్టేడియంలో ఈ రోజు మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొని ప్రసంగించనున్నారు. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలను భారతీయ జనతాపార్టీ అధిష్టానం మోడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో పాల్గొనున్నారు. అందులోభాగంగా హైదరాబాద్‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన నవభారత్ యువభేరి సభ మొట్టమొదటిది. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొనే నరేంద్ర మోడీ విద్యార్థులు, మేధావులతో భేటీ అవుతారు. స్టేడియంలో సదస్సు అనంతరం నేరుగా ఆయన అక్కడకు వెళతారు. 15 మంది పీఠాధిపతులు, మరికొంతమంది సాధువులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపి ఆశీర్వాదం తీసుకుంటారని తెలిసింది.