గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాలు పలువురు ప్రముఖులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరంలోని పార్క్హయత్ హోటల్ చేరుకున్నారు. నగరంలోని ఎల్ బీ స్టేడియంలో ఈ రోజు మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొని ప్రసంగించనున్నారు.
దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలను భారతీయ జనతాపార్టీ అధిష్టానం మోడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో పాల్గొనున్నారు. అందులోభాగంగా హైదరాబాద్లో ఈ రోజు ఏర్పాటు చేసిన నవభారత్ యువభేరి సభ మొట్టమొదటిది.
నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొనే నరేంద్ర మోడీ విద్యార్థులు, మేధావులతో భేటీ అవుతారు. స్టేడియంలో సదస్సు అనంతరం నేరుగా ఆయన అక్కడకు వెళతారు. 15 మంది పీఠాధిపతులు, మరికొంతమంది సాధువులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపి ఆశీర్వాదం తీసుకుంటారని తెలిసింది.