హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో ఉన్న కేశవ్ మెమోరియల్ స్కూల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అక్కడసర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నవభారత్ యువభేరీకి సభ సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన మోడీ.. తరువాత కేశవ్ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించారు.
అంతకు ముందు ఎల్బి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గాంధీ, వల్లభాయి పటేల్ పుట్టిన ప్రాంతం నుంచి తాను వచ్చినట్లు తెలిపారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. సామాన్యుడికి మేలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు.