ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు | Book exhibitions in the each district | Sakshi
Sakshi News home page

ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు

Published Mon, Jan 2 2017 4:44 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు - Sakshi

ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు

విజయవాడ పుస్తకమహోత్సవం ప్రారంభంలో సీఎం వెల్లడి

సాక్షి, విజయవాడ: ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ, భాషా, సాంస్కృతికశాఖ, ఎన్టీఆర్‌ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న 28వ పుస్తకమహోత్సవాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, సమాజం నాలెడ్జ్‌ సొసైటీగా మారడానికి ఇటువంటి పుస్తకప్రదర్శనలు  ఉపయోగపడతాయని అన్నారు. ఈ విషయాల్లో మీడియా సానుకూల దృక్పథాలతో రాయడం నేర్చుకోవా లని సూచించారు. మంచి సంఘటనలు బాగా పబ్లిష్‌ చేయాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్నప్పటికీ, పుస్తకం చదువుతుంటే పొందే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. పుస్తకం చదవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement