మంత్రి బొత్స రాజీనామా చేయాలి
Published Mon, Jan 6 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
విజయనగరం మున్సిపాల్టీ,న్యూస్‌లైన్: పాలెం బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోలేని మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని యువసత్తా జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి వెంకటరమణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జబ్బార్ ట్రావెల్స్ ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక లోక్‌సత్తా నాయకులు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పాండ్రంకి మాట్లాడు తూ, బస్సు ప్రమాదం జరిగి 66 రోజులు గడుస్తున్నా బాధితుల కు ఎటువంటి న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే జబ్బార్ ట్రావెల్స్ లెసైన్సును శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాం డ్ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతలపూడి అప్పలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం జబ్బార్ ట్రావెల్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సుభద్రాదేవి, మెల్లేటి నాయుడు, పరుచూరి ఉదయగౌరి, ఎ.కాశీపతి, జి. వీర్రాజు, పవన్, మాధవ్, టి.అప్పారావు పాల్గొన్నారు.
Advertisement