'బాబు వచ్చాక... జాబులు పోయాయి'
విజయవాడ: కృష్ణాజిల్లాలోని నందిగామ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా బి.బాబురావును పోటీలో నిలబెడుతున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసేందుకే తమ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
బాబు వస్తే జాబు వస్తుందన్నారు.... కానీ బాబు వచ్చిన తర్వాత ఉన్న జాబులు పోయాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే ఎన్ని సంవత్సరాల్లో రైతు రుణాలు మాఫీ చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.