సాక్షి, విజయవాడ: అంగన్‌వాడి కేంద్రం నుంచి ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి యత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ కొత్తపేట అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న శివ అనే బాలుడిని ఓ గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లేందుకు యత్నించింది. ఇది గుర్తించిన అంగన్‌వాడి సిబ్బంది ఆమెను అడ్డుకొని పోలీసులకు అప్పగించారు.
వివరాలు.. మల్లికార్జున పేటకు చెందిన ఆళ్ల సూరి, దేవి దంపతుల మూడేళ్ల బాలుడు శివ కొత్తపేట అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు అంగన్‌వాడికి వెళ్లిన బాలుడిని ఖమ్మం జిల్లాకు చెందిన ఆంబోతుల క్రాంతి(65) అనే మహిళ ఎత్తుకెళ్లడానికి యత్నించింది. బాలుడి కేకలు విని గమనించిన అంగన్‌వాడి సిబ్బంది ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment