గన్నవరం : కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ తగిలింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జేడీ శీలం కాన్వాయ్ని శుక్రవారం ఉదయం సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవటంతో...ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమైక్యవాదులు శీలం కాన్వాయ్పై చీపుర్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.