
సాక్షి, అనంతపురం: చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చిలేదని మండిపడ్డారు. (రాజ్యాంగ పదవిలో ఉన్నారు.. రాజకీయం చేయొద్దు)
కోవిడ్-19 పరికరాలు కొనుగోలు చేయలేదని చంద్రబాబు దుష్పచారం చేయటం తగదన్నారు. హైదరాబాద్‌లో కుర్చుని చంద్రబాబు విమర్శలు చేయటం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ చేసే ప్రతి పనిని బాబు విమర్శించినడం సరికాదన్నారు. కాగా కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్య సిబ్బందికి కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇందుకోసం వైద్య సిబ్బందికి పీపీఈలు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment