చింతపల్లిరూరల్ : మావోయిస్టు కార్యకలాపాలకు గిరిజనులంతా దూరంగా ఉండాలని డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం అన్నవరం వారపుసంతలో మావోయిస్టు వ్యతిరేక వాల్‌పోస్టర్లను విస్తృతంగా అతికించారు. అన్నం పెట్టిన గిరిజన కుటుంబాలనే అంతమొందిస్తున్న మావోయిస్టులకు ఇకనైనా ఆశ్రయం ఇవ్వకుండా బహిష్కరించాలని సూచిం చారు.
మావోయిస్టు తమ ఉనికి చాటుకునేందుకు పోలీసు ఇన్‌ఫార్మర్‌ల పేరిట గిరిజనులను హత్య చేస్తున్నారన్నారు. ఈ సంస్కృతిపై గిరిజన యువత, విద్యార్థులు, గ్రామపెద్దలు ఆలోచించాలన్నారు. సీఐ ప్రసాద్, అన్నవరం ఎస్సై ఉమా మహేశ్వరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం
Published Tue, Sep 16 2014 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement