'కర్నూలులో రూ. 45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి' | Cancer hospital to come up at Kurnool at a cost of Rs.45 crore, says State Minister Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

'కర్నూలులో రూ. 45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి'

Published Sun, Jul 20 2014 11:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

'కర్నూలులో రూ. 45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి'

'కర్నూలులో రూ. 45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి'

కర్నూలులో రూ. 45 కోట్ల వ్యయంతో కేన్సర్ ఆసుపత్రి నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. స్విమ్స్లో  ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడల మధ్య ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

ఆరోగ్యశ్రీ పథకంలో సమూలంగా మార్పులు తీసుకు వస్తామన్నారు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ కార్డులతో నిరుద్యోగులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుమలలో విఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement