కారు బోల్తా.. మహిళ మృతి
తిరుపతి: మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతెపల్లి గ్రామ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. తమిళనాడుకు చెందిన కారు(టీఎన్ 77జడ్ 2545) చిత్తూరు నుంచి తిరుమలకు వస్తుండగా గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతురాలుకి చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.