car roll
-
ఎయిర్పోర్ట్ రోడ్డులో కారు బోల్తా
- ఇద్దరికి తీవ్ర గాయాలు రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ ముందు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఇండిగో ఎయర్‌లైన్స్‌కు చెందిన మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనం శ్రీశైలం హైవే వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఎయిర్పోర్ట్ అపోలో ఆస్పత్రికి తరలించారు. -
పాపవినాశనం వద్ద ప్రమాదం
ఘంటసాల: కృష్ణా జిల్లా ఘంటసాల మండల పాపవినాశనం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ కారు కేఈబీ కెనాల్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న డ్రైవర్ కం యజమానిని స్థానికులు రక్షించారు. బాధితుడు కాకినాడ బ్రేక్ ఇన్స్పెక్టర్గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఔటర్’పై కారు బోల్తాముగ్గురికి గాయాలు
ఊడిన ముందు చక్రం అతివేగంతో ప్రమాదం మహేశ్వరం : ఔటర్‌రింగ్ రోడ్డుపై ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహేశ్వరం మండలం మంఖాల్ ఔటర్‌రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రావిర్యాల మీదుగా శంషాబాద్ వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో మంఖాల్ గ్రామ సమీపంలోకి రాగానే వేగంగా ఉన్న కారు ముందు చక్రం ఊడిపోయింది. అంతలోనే వెనుక టైర్ పగలడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలువిరిపోయింది. వెనుక కూర్చున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పహాడిషరీఫ్ సిఐ చలపతి తెలిపారు. -
అయ్యప్ప భక్తుల కారు బోల్తా: ఒకరి మృతి
కొత్తకోట: కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తకోట శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుంది. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఘాట్ రోడ్డులో కారు బోల్తా
సీలేరు: విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మ ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్ లోని మూల మలుపు వద్ద టర్న్ తీసుకుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్ధానికులు తెలిపారు. క్షతగాత్రులంతా ఒడిసా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని దారకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు
కొత్తకోట: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుండగా కారు ముమ్మళ్లపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా.. మహిళ మృతి
తిరుపతి: మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతెపల్లి గ్రామ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. తమిళనాడుకు చెందిన కారు(టీఎన్ 77జడ్ 2545) చిత్తూరు నుంచి తిరుమలకు వస్తుండగా గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతురాలుకి చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దక్కిలిలో కారు బోల్తా..ముగ్గురి మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా దక్కిలి మండలం మిట్టపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. గ్రామంలోని మూల మలుపు వద్ద బుధవారం మధ్యాహ్నాం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వీరంతా పెళ్లి నిమిత్తం శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (దక్కిలి) -
కారు బోల్తా: ఒకరి మృతి
అనంతపురం: వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. హిందూపూర్ టీచర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్(21), శేఖర్(25) అనే ఇద్దరు స్నేహితులు సోమవారం ఉదయం పెనుకొండ నుంచి హిందూపూర్‌కు కారులో బయలు దేరారు. కారు చిలమత్తూరు మండలం కోడూరు వద్దకు చేరు కోగానే ఒక్కసారిగా ముందు టైరు పేలిపోవడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు శేఖర్‌ను హిందూపూర్ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా: ఇద్దరి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...సోమవారం వేకువ జామున మార్కాపురం తిట్టాయిగూడెం గ్రామంలో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రుల గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. (మార్కాపురం)