పాపవినాశనం వద్ద ప్రమాదం
Published Tue, Aug 16 2016 4:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఘంటసాల: కృష్ణా జిల్లా ఘంటసాల మండల పాపవినాశనం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ కారు కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న డ్రైవర్ కం యజమానిని స్థానికులు రక్షించారు. బాధితుడు కాకినాడ బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement