కొత్తకోట: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుండగా కారు ముమ్మళ్లపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు.