ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన తమ్ముడు సంతోష్‌రెడ్డిపై తెలంగాణ ఏర్పడగానే సీబీఐ విచారణ జరిపించి జైలుకు పంపిస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు.
పాలకుర్తి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన తమ్ముడు సంతోష్‌రెడ్డిపై తెలంగాణ ఏర్పడగానే సీబీఐ విచారణ జరిపించి జైలుకు పంపిస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం జరిగిన నియోజకవర్గస్థారుు టీఆర్‌ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన రాగానే సీఎం చిత్తూరు జిల్లాకు రూ.7,200 కోట్ల నిధులతో హడావుడిగా శంకుస్థాపనలు చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలు మూతపడుతుంటే.. చిత్తురు జిల్లాలో రూ.120 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు.